Friday, April 26, 2024
- Advertisement -

జగన్ ని అభినందించిన పవన్..!

- Advertisement -

ఎంతో అనుభవం ఉన్న టీడీపీని జనాలు మర్చిపోయేలా చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. 151 అసెంబ్లీ స్థానాలతో కనీ వినీ ఎరుగని విజయం సొంతం చేసుకున్నారు. అయితే చంద్రబాబుతో పోలిస్తే జగన్ కు తక్కువ అనుభవమే ఉంది. ఇలాంటి సమయంలో జగన్ ఎలా నెట్టుకోస్తారని అందరిలో సందేహం ఉంది. కానీ ప్రస్తుతం జగన్ పాలన సాగుతున్న తీరు చూస్తే సందేహాలు,అనుమానాలు పటాపంచలైనట్లే కనిపిస్తోంది.

కరోనా వేళ మహా మహా ఉద్దండులే విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో… వైఎస్ జగన్ మాత్రం ప్రత్యర్థుల చేత శభాష్ అనిపించుకుంటున్నారు. తాజాగా పవన్ కూడా జగన్ పాలనకు ఫిదా అయ్యారు. ఆయన స్పందిస్తూ..”ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు,అత్యవసర సేవల్ని అందించే అంబులెన్సులను ప్రస్తుతం ఉన్న అత్యవసర పరిస్థితుల్లో ప్రారంభించడం అభినందనీయం. అలాగే గత 3 నెలలుగా కరోనా టెస్టుల విషయంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా ప్రభుత్వం పనిచేస్తున్న తీరు అభినందనీయం..’ అంటూ పవన్ కల్యాణ్ ట్విట్టర్‌లో జగన్‌పై ప్రశంసలు కురిపించారు.

ఒకప్పుడు జగన్‌ను ‘సీఎం’ అని సంబోధించేందుకు కూడా ఇష్టపడని పవన్… ఇప్పుడు తనే స్వయంగా ఆయనకు అభినందనలు చెప్పడం గమనార్హం. 108,104 అంబులెన్సుల విషయంలో సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాత్రం తీవ్ర విమర్శలు,ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగన్‌పై ప్రశంసలు కురిపించడం వైసీపీకి బిగ్ బూస్టింగ్ అనే చెప్పాలి. పవన్ వ్యాఖ్యలతో వైసీపీ చంద్రబాబును కూడా కౌంటర్ చేయవచ్చు. కరోనా విషయంలో ఏ రాష్ట్రం తీసుకుని జాగ్రత్తలు ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్నారు. టెస్టుల సంఖ్యను పెంచడం,ప్రతీ జిల్లాలో కోవిడ్ 19 ఆస్పత్రులను ఏర్పాటు చేయడం చేశారు.

రఘురామకృష్ణరాజు పై అనర్హత వేటు..?

పదవిని మూన్నాళ్ళ ముచ్చటగా చేసుకోకండి : జగన్ పై ముద్రగడ కామెంట్స్

వైఎస్‌ఆర్‌కి అర్దం ఏంటో చెప్పిన దేవినేని ఉమ..!

సెంటిమెంట్ ను పక్కన పెట్టేసిన జగన్.. కానీ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -