Friday, April 26, 2024
- Advertisement -

రోహిత్ శర్మకు గాయం.. ఆడటంపై కోహ్లీ క్లారిటీ..!

- Advertisement -

టీమిండీయా ఓపెనర్ రోహిత్ శర్మ గాయంపై కెఫ్టెన్ విరాట్ కోహ్లీ క్లారిటీ ఇచ్చారు. రాజ్‌కోట్ వేదికగా శుక్రవారం నాడు ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండగా.. రోహిత్ భుజానికి గాయమైంది. బౌండరీ లైన్ వద్ద బంతిని పట్టబోయే క్రమంలో పట్టు జారి రోహిత్ కింద పడిపోయాడు.

దాంతో అతని ఎడమ చేతి భూజానికి గాయమైంది. ఆ తర్వాత ఫీల్డింగ్‌కి రోహిత్ శర్మ దూరంగా ఉన్నాడు. ఇక రోహిత్ గాయంపై కెఫ్టెన్ కోహ్లీ స్పందిస్తూ.. “గాయం గురించి రోహిత్ తో మాట్లడాను. భుజంకు గాయమైనప్పటికి.. నొప్పి ఏమీ లేదని చెప్పాడు. కాబట్టి.. బెంగళూరు వేదికగా ఆదివారం జరిగే ఆఖరి వన్డేలో అతను ఆడతాడని నేను అనుకుంటున్నా’ అని కెప్టెన్ స్పష్టం చేశాడు. 2018 ఐపీఎల్ సమయంలోనూ రోహిత్ శర్మకి ఇలానే భుజానికి గాయమైంది. కానీ.. రెండు రోజుల్లోనే మళ్లీ అతను ఫిట్‌నెస్ సాధించాడు.

ఇక మరో ఓపెనర్ శిఖర్ ధావన్ గాయంపై మాత్రం ఎలాంటి అప్ డేట్ రాలేదు. ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ బౌలింగ్‌లో బంతిని హిట్ చేసేందుకు ధావన్ ప్రయత్నించాడు. కానీ.. బ్యాట్‌కి అందని బంతి నేరుగా వెళ్లి అతని పక్కటెముకలకి బలంగా తాకింది. దీంతో.. క్రీజులోనే నొప్పితో ధావన్ కాసేపు పడుకుండిపోయాడు. కానీ తర్వాత కోలుకున్న ధావన్.. శతక సమాన ఇన్నింగ్స్‌తో భారత్ పరువు నిలిపాడు. ఈ మ్యాచ్‌లో భారత్ జట్టు 36 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -