Saturday, May 4, 2024
- Advertisement -

పోలవరం పై కొనసాగుతున్న ఉత్కంఠ!

- Advertisement -

పోలవరం ప్రాజెక్టు గోదావరి, కృష్ణా నదులను అనుసంధానిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా, పోలవరం సమీపంలో నిర్మాణంలో ఉన్న బహుళార్థ సాధక నీటిపారుదల పథకం. విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలోని మెట్టప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ పథకం పూర్తయిన తర్వాత విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల సాగునీటి అవసరాలే కాక, విశాఖ మహానగరం యొక్క తాగునీటి అవసరాలు, విశాఖపట్నం చుట్టుపక్కలనున్న తీరప్రాంత పరిశ్రమల పారిశ్రామిక అవసరాలు కూడా తీరుస్తుందని అంచనా. అంతా ఓకే అయినా ఈ ప్రాజెక్టు కు రాజకీ రంగు పులమడంతో ఎన్నో అవాంతరాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ ఏది వచ్చినా పోలవరం మాత్రం ముందుకు సాగకుండా సాగదీస్తూనే ఉన్నారు.

తాజాగా పోలవరం పై కేంద్రం తమ వైఖరి తెలియజేస్తూ పలు అంశాలను ముందుకు తీసుకు వచ్చింది. 2013-14 అంచనాల మేరకు ఈ ప్రాజెక్టు తుది అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లేనని 2017 మార్చి 15న కేంద్ర కేబినెట్‌ తీర్మానించిందని.. తామూ దీనికే కట్టుబడి ఉన్నామని గత నెల 12వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కు సమాచారమందించారు.  గత నెల 21న మరోమారు జలశక్తి శాఖ ద్వారా పీపీఏకి ఇదే విషయం తెలియజేశారు.

ఇదిలా ఉంటే.. పోలవరం ప్రాజెక్టు తుది అంచనాల విషయంలో కేంద్రం వైఖరి ఉత్కంఠ రేపుతోంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అత్యవసర సర్వసభ్య భేటీలో రూ.55,548.87 కోట్ల తుది అంచనాలకు  అంగీకరించాల్సిందేనని.. కాదంటే కేంద్ర జలశక్తి శాఖ నియమించిన సవరించిన అంచనాల కమిటీ (ఆర్‌ఈసీ) నిర్ధారించిన రూ.47,725.74 కోట్లయినా ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయమేంటో ఇంతవరకు వెల్లడి చేయలేదు. పీపీఏ భేటీకి సంబంధించిన మినిట్స్‌ వివరాలు ఇప్పటివరకు రాష్ట్రప్రభుత్వానికి అందలేదని అంటున్నారు.కాగా, ఇంకా పోలవరం పై ఇంకా ఉత్కంఠ సాగుతూనే ఉంది.

కేబినెట్ తీర్మానాల్లో చంద్రబాబు పోలవరం గుట్టు…?

అడ్డుపుల్లలు పడుతున్నా ఆగని పోలవరం పనులు

ప్రచార ఆర్భాటాలు లేకుండా పోలవరం పనులు

గడ్డర్ల ఏర్పాటుతో పరుగులు పెడుతున్న పోలవరం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -