- Advertisement -

ఆచార్య సెట్స్‌లో సోనూ సూద్‌కి సత్కారం!

- Advertisement -

కరోనా టైంలో బాలీవుడ్ నటుడు సోనూ సూద్ చేసిన సహాయం ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. ముఖ్యంగా వలస కార్మికుల కోసం ఆయన చేసిన సాయం గొప్పది. ఆపదలో ఉన్నప్పుడూ ఆపద్భాందవుడిగా నిలిచి అందరి మనసులలో హీరో అయ్యాడు సోనూ. లాక్ డౌన్ టైంలో ఆయన చేసిన సామాజిక సేవలు వెలకట్టలేనివి.

వైద్యుల కోసం హోటల్ కేటాయించిన సోనూ సూద్, వలస కార్మికులని వారి సొంత గ్రామాలకి తరలించేందుకు బస్సులు, రైళ్ళు, చార్టర్డ్ ఫ్లైట్స్ ఏర్పాటు చేసాడు. తన సొంత డబ్బుతో ఇవన్ని చేశాడు. దాంతో దేశ వ్యాప్తంగా ఆయనను ప్రజలు ప్రశంసించారు. కొందరు అయితే ఆయనకు వీరాభిమానులు అయ్యారు. అయితే ఇప్పటికీ తన తన బాధ్యత ఇంకా పూర్తి కాలేదంటున్నారు సోనూ సూద్‌.

ప్రస్తుతం దేశంలోనే ఆయనను రియల్ హీరో అని ప్రశంసిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా ఆయనను మెచ్చుకుంటూ సత్కరిస్తున్నారు. శివ కొరటాల దర్శకత్వంలో చిరంజీవి ఆచార్య సినిమా లాక్‌డౌన్‌ తరువాత షూటింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఆచార్య సినిమా షూటింగ్ సెట్స్‌లో దర్శకుడు శివ కొరటాల, నటుడు తనికెళ్ల భరణి సోనూసూద్‌ను సత్కరించారు. ఆయనకు షాలువా కప్పి, హనుమంతుడి ప్రతిమను అందించారు.

ఈ టాప్ విలన్‍ల రెమ్యునరేషన్ ఎంతంటే..?

సోనూ సూద్ రియల్ హీరో.. 400 కుటుంబాలకు సాయం

బుల్లితెరపై కూడా కన్నేసిన స్టార్ హీరోయిన్లు..!

ఆచార్య లో రామ్ చరణ్ విలన్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -