ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. 30 శాతం పీఆర్సీతో పాటు ఉద్యోగ పదవీ విరమణ పెంపును 61 ఏళ్లకు పెంచుతూ శాసనసభలో ప్రకటన చేశారు. 2020 ఏప్రిల్ 1 నుంచి పీఆర్సీ అమలవుతుందని తెలిపారు. కరోనా, ఇతర పరిస్థితుల వల్ల పీఆర్సీ కొంత ఆలస్యమైందన్నారు. 12 నెలల బకాయిలు చెల్లిస్తామని చెప్పారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 9,17,097 మంది ఉద్యోగుల వేతనాలు పెరుగుతాయని ముఖ్యమంత్రి వెల్లడించారు.
కరోనా విపత్తు ఆర్థిక వ్యవస్థను కుదిపేసిందని సీఎం అన్నారు. 11వ వేతన సవరణ కొంత ఆలస్యమైందని వివరించారు. మెరుగైన రీతిలో వేతన సవరణ ఉండేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఉద్యోగులకే కాకుండా.. ప్రభుత్వం యంత్రాంగంలో భాగస్వామ్యమైన వాళ్లందరికీ వర్తించేలా పీఆర్సీ ప్రకటించామని తెలిపారు.
12 నెలల బకాయి వేతనాలు పదవీ విరమణ సమయంలో పొందేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రిటైర్మెంట్ గ్రాట్యుటీ 12 నుంచి 16 లక్షలకు పెంపుతో పాటు.. విశ్రాంత ఉద్యోగులు పూర్తిస్థాయి పింఛను పొందే అర్హత వయసును 75 సంవత్సరాల నుంచి 70 ఏళ్లకు తగ్గిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. విధినిర్వహణలో మరణించిన సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాలకు ఫ్యామిలీ పింఛన్ విధానం వర్తింపజేయాలని నిర్ణయించామన్నారు.
అందరూ హ్యాపీ.. 30 శాతం ఫిట్మెంట్..!
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రికి కరోనా!
రాజస్థాన్ లో దారుణం.. ఆడుకుంటూ వెళ్లి 8 మందిచిన్నారులు మృతి!
