బుల్లితెర యాంకర్ అనసూయ ‘జబర్దస్త్’ కామెడీ షోతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ హాట్ బ్యూటీ అద్భుతమైన వాక్చాతుర్యంతో, బుల్లితెరపై రాణిస్తూనే, వెండితెరపై వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రస్తుతం బిజీ స్టార్ అయిపోయింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారుకు మతి పోగొడుతుంది.
ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షోలో యాంకరింగ్ చేస్తూనే హైపర్ ఆది స్కిట్ లలో కూడా నటిస్తోంది అనసూయ.అంతేకాకుండా వీరిద్దరి జోడి కూడా జబర్దస్త్ ప్రోగ్రాం లో హైలెట్ గా నిలుస్తుంది. తాజాగా జబర్దస్త్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల కాగా అందులో ఆది తనతో చనువుగా ఉండేసరికి తన పై కన్నేశాడు అంటూ అనసూయ బాగా ఎమోషనల్ అయ్యింది. ఆ డైలాగ్ హైపర్ ఆది, శాంతి స్వరూప్ చేసిన స్కిట్లో పంచ్ డైలాగ్ ప్రస్తుతం వైరల్ మారింది.
Also read:బాలకృష్ణ సరసన ఆ బ్యూటీ.. సినిమాలో కీలక పాత్ర!
ఇటీవలే అనసూయ ప్రధాన పాత్రలో రూపొందిన ‘థాంక్యూ బ్రదర్’ సినిమాను ఆహా ఓటీటీ వేదికపై రిలీజ్ చేయగా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.ఇక కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న రంగ మార్తాండలో అనసూయ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుత అనసూయ తమిళ్, మలయాళం మూవీస్ లో కూడా నటిస్తున్నట్లు సమాచారం.
Also read:సోనూ సూద్ ఫౌండేషన్ కు సారా అలీఖాన్ భారీ విరాళం.. ఎంతంటే?
