- Advertisement -

దళితుల పై అనుచిత వ్యాఖ్యలు.. బుల్లితెర నటి పై కేసు నమోదు!

- Advertisement -

బుల్లితెర నటి యువికా చౌదరి నిమ్న కులాల వివరణ కించపరిచే విధంగా చేసిన అనుచిత వ్యాఖ్యల పై పోలీసు కేసు నమోదయ్యింది.తాజాగా ఆమె షేర్ చేసిన ఒక వీడియోలో దళిత కులాలైన ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన వారిని ఎంతో అవమానకరంగా మాట్లాడటంతో ఈ వీడియో పై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఈ క్రమంలోనే నటి పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దళిత సామాజిక కార్యకర్త రాజత్‌ కల్సన్‌ సదరు నటిపై చర్యలు తీసుకోవాలంటూ హర్యానా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

Also read:బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టబోతున్న సత్యదేవ్!

ఈ క్రమంలోనే సామాజిక కార్యకర్త రాజత్ యువికా షెడ్యూల్డ్‌ కులాల మీద అవమానకరమైన, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మే 26న నదిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని శనివారం హర్యానా పోలీసులు మీడియాకు తెలిపారు.
యువికా మే 25న ఒక వీడియో రిలీజ్‌ చేసింది. ఇందులో షెడ్యూల్డ్‌ కులాలను అవమానకరంగా మాట్లాడటంతో ఈమెకు నెట్టింట్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఏర్పడింది.

Also read:మా అమ్మ ఎదురుగానే ఆ నిర్మాత ఎంతో అసభ్యంగా మాట్లాడాడు:కిష్వర్ మర్చంట్

ఈ క్రమంలోనే నటి తాను తప్పుగా మాట్లాడి ఉంటే తనను క్షమించాలని, నేను మాట్లాడిన మాటలకు సరైన అర్థం తెలియకనే ఈ విధమైనటువంటి పొరపాటు జరిగిందని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా తాజాగా ఎస్సీ ఎస్టీ కులాల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బుల్లితెర నటి మున్మున్‌ దత్తా మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన సంగతి మనకు తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -