రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ ఇండస్ట్రీకి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ ద్వారా పరిచయమై తర్వాత వరుస అవకాశాలను కొల్లగొట్టి సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకుంది. ఇటీవలే నితిన్ హీరోగా ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి రూపొందించిన చిత్రం ‘చెక్’. ఈ మూవీలో రకుల్‌ప్రీత్ సింగ్ లాయర్ మానసగా కీలకపాత్ర పోషించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనలు అందుకుంది.దక్షిణాదిలో అగ్ర కథానాయికగా కొనసాగుతున్న సమయంలోనే బాలీవుడ్ బాట పట్టిన ఈ పంజాబీ బ్యూటీ అనతికాలంలోనే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన కెరీర్ కు సంబంధించిన విషయాలను అలాగే సమాజంలో జరుగుతున్న విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా రకుల్ ఓ పత్రికలో వచ్చిన దారుణమైన అత్యాచార ఘటన గురించి మాట్లాడుతూ ఈ ఘటన గురించి పత్రికలో చదువుతున్నప్పుడు నా రక్తం మరిగింది. ఇలాంటి ఆటవిక సమాజంలో మనం బతుకుతున్నాం అందుకు సిగ్గుపడాలి. అంటూ తన ఆవేదనను వ్యక్తం చేసింది. అలాగే కరోనా సమయంలో కష్టాల్లో ఉన్న వారికి మనకు తోచిన సాయం చేయండి అంటూ సూచించింది.
Also read:నాకు కార్తీకదీపం నచ్చదు.. డాక్టర్ బాబు భార్య వైరల్ కామెంట్స్!
రకుల్ కెరీర్ విషయానికి వస్తే ఈ బ్యూటీ బాలీవుడ్లో అడుగుపెట్టి ఏడేళ్లు అవుతున్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గట్లేదు.అమితాబ్‌బచ్చన్, అజయ్‌దేవ్‌గణ్‌తో కలిసి ‘మేడే’ సినిమాలోనూ, జాన్ అబ్రహ జంటగా ‘ఎటాక్ ’మూవీలో నటిస్తోంది.అలాగే టాలీవుడ్ లో క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ విభిన్న పాత్రలో నటిస్తోంది.
