Saturday, May 4, 2024
- Advertisement -

జగన్​ సర్కార్​పై వకీల్​సాబ్​ సీరియస్​?

- Advertisement -

ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం జనసేన అధినేత పవన్​కల్యాణ్ కు తీవ్రంగా కోపం తెప్పించింది. అప్పుడెప్పుడో తిరుపతి సభలో కనిపించిన పవన్​ కల్యాణ్​ .. ఆ తర్వాత కరోనాతో కొంతకాలం రెస్ట్ తీసుకున్నాడు. చాలా రోజుల పాటు రాజకీయంగా ఒక్క ప్రకటన కూడా చేయలేదు. ఏ రాజకీయ కార్యక్రమంలో పాల్గొనలేదు. పెద్దగా ట్వీట్లు కూడా చేయలేదు. ఇటీవల ఆయన మళ్లీ యాక్టివ్​ అయ్యారు. రీసెంట్​గా నిరుద్యోగుల తరఫున పోరాటం చేస్తున్నట్టు ప్రకటించారు. కొందరు నిరుద్యోగులు ఆయనను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా మరోసారి జగన్​ సర్కార్​పై జనసేనాని నిప్పులు చెరిగారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల తెలుగు అకాడమీని.. తెలుగు సంస్కృత అకాడమీగా ప్రకటించింది. ఈ విషయం పవన్​ కల్యాణ్​కు కోపం తెప్పించింది. ఏపీ ప్రభుత్వం తెలుగు భాషకు తీరని ద్రోహం చేస్తుందని ఆయన మండిపడ్దారు. ప్రభుత్వానికి ఒకవేళ సంస్కృతం మీద ప్రేమ ఉంటే.. సంస్కృత అకాడమీని ప్రత్యేకంగా స్థాపించాలని సూచించారు. అంతేకాని తెలుగు అకాడమీ పేరు మార్చడం సరైన నిర్ణయం కాదని మండిపడ్డారు.

ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని భాషాభిమానులు తీవ్రంగా ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వం తెలుగు భాషకు తీరని అన్యాయం చేస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సూచించారు. లేదంటే పోరాటం చేస్తామని హెచ్చరించారు.

Also Read

కరోనాపై సీఎం కేసీఆర్​ అలర్ట్.. మరోసారి జ్వర సర్వేకు ఆదేశం..!

ప్రజల కష్ట-సుఖాలు మరోసారి స్వయంగా తెలుసుకో నున్నా జగన్..!

అన్నాడీఎంకేలో శశి ‘కలకలం’… చిన్నమ్మ పాచికలు పారతాయా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -