Friday, April 19, 2024
- Advertisement -

ప్రజల కష్ట-సుఖాలు మరోసారి స్వయంగా తెలుసుకో నున్నా జగన్..!

- Advertisement -

జగన్ సీఎం అయిన దగ్గరినుంచి చంద్రబాబు వైఖరి ప్రజలకు ఏమాత్రం రుచించట్లేదు.. జగన్ తో కలిసి ఏ ఒక్క విషయంలో కూడా చంద్రబాబు ముందుకు రాలేదు కదా కనీసం మద్దతు కూడా తెలపలేదు.. తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పక్ష నేతలు సైతం తనను పొగడాలి అనుకునే చంద్రబాబు ఇప్పుడు దాన్ని మరిచి జగన్ ని విమర్శించడం ప్రజలు గమనిస్తున్నారు.. పోయిన ఎన్నికల్లో సీఎం అయిన తర్వాత జగన్ స్పోర్టివ్ గా తీసుకుని కొన్ని విషయాల్లో చంద్రబాబు కు సహకరించారు.. కానీ చంద్రబాబు ఇన్ని ఏళ్ల రాజకీయ అనుభవం ఉండి కూడా తన కన్నా చిన్నవాడైన జగన్ ని ఓర్వకుండా ఉండడం ఎవరికీ నచ్చడం లేదు..

మంచి చెడు చెప్పేది పోయి ఇలా పగ పట్టినట్లు ప్రవర్తించడం చంద్రబాబు అసూయా ని తెలియజేస్తుందని అంటున్నారు.. సొంత పార్టీ నేతలు సైతం జగన్ పై చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతున్నారు.. అయితే టీడీపీ నుంచి ఈ కోణం లో రాజకీయం ఉండగా, జగన్ మాత్రం ఎవరిని పట్టించుకోకుండా సుపరిపాలనపై ద్రుష్టి పెట్టి ప్రజల క్షేమమే లక్ష్యంగా సాగుతున్నారు.. కరోనా సమయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ బెస్ట్ సీఎం గా ఉంటున్నారు.. ఇంతవరకు ఏ ఒక్క సంక్షేమ పధకాన్ని కూడా ఆయన ఆపలేదు. ఇక ముఖ్యమైన వాటికి శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా ఆయన‌ జగన్ చేస్తూ వచ్చారు. ఇక ఇపుడు జగన్ నేరుగా జనంలోకి వస్తున్నారు. ఇక ఇటీవలే జగన్ ఓ నిర్ణయం తీసుకున్నారట..

జగన్ గతంలో మాదిరిగానే కనీస జాగ్రత్తలు కొన్ని తీసుకుని జనంలోకి రావాలనుకుంటున్నారు. వారానికి రెండు సచివాలయాలు సందర్శించేలా జగన్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.. తద్వారా జనానికి తానెప్పుడూ దూరం కాదు. జనంతో మమేకమై ముందుకు సాగడానికి ఎప్పుడూ జగన్ సిద్ధమే అనే సందేశాన్ని ఇవ్వనున్నారు. జనం లోకి జగన్ రాకతో ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

అప్పుడు చేసిన పాదయాత్ర మాదిరే ప్రజల కష్టాలను తెలుసుకుని వాటిని తీర్చేలా చూస్తున్నాడు.. అయితే ఇది చంద్రబాబు కి పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పాలి.. చంద్రబాబు కరోనా దెబ్బకు హైదరాబాద్ లోని తన ఇంటికే పరిమితం అయిపోయారు.. ఈ నేపథ్యంలో ఎంత కష్టమొచ్చినా జగన్ ప్రజలను ఆదుకోవడానికి ముందుకు వచ్చారు అనే భావన ప్రజల్లో నాటుకుపోతుంది.. అప్పుడు జగన్ వచ్చేసారి సీఎం అవడం ఖాయం అని విశ్లేషలు అంటున్నారు.. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఏం చేస్తాడో చూడాలి..

Also Read: చంద్రబాబు, లోకేశ్​పై క్యాడర్​ నిరుత్సాహం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -