Friday, April 19, 2024
- Advertisement -

కరోనాపై సీఎం కేసీఆర్​ అలర్ట్.. మరోసారి జ్వర సర్వేకు ఆదేశం..!

- Advertisement -

వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండటం, థర్డ్​వేవ్​ వస్తుందంటూ నిపుణులు హెచ్చరిస్తుండటంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ అలర్టయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా జ్వర సర్వేను నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ఇతర ముఖ్య అధికారులతో సీఎం కేసీఆర్​ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ’కరోనా వ్యాధి ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు. ఏ టైంలో ఏ వేవ్​ వస్తుందో? ఏప్రాంతంలో ఏ వేరియంట్ వస్తుందో? ఎవరికీ అర్థం కావడం లేదు. కాబట్టి అంతా జాగ్రత్తగా ఉండాలి. ప్రజలకు కూడా ఈ విషయంపై అవగాహన కల్పించాలి.కరోనా కేసులు బయపడుతున్న ప్రాంతాల్లో మళ్లీ జ్వర సర్వే నిర్వహించాలి. సరిహద్దు గ్రామాలను పరిశీలనలో ఉంచాలి.ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయాలి.

సరిహద్దు జిల్లాల్లో ఇంకా కరోనా కేసులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు అలర్ట్​గా ఉండాలి. కరోనా కేసుల విషయంలో శాస్త్రీయ అధ్యయనం సాగాల్సి ఉంది’ అని సీఎం కేసీఆర్​ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన వైద్య శాఖ అధికారులు, ఆరోగ్య నిపుణులతో ప్రత్యేకంగా సమావేశమై పలు విషయాలపై కూలంకషంగా చర్చించారు.

Also Read

థర్డ్​వేవ్.. పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

జికా వైరస్ ఎలా సోకుతుంది? లక్షణాలు ఏమిటి?

సోషల్ మీడియా సినీ ఇండస్ట్రీకి ప్లస్సా.. మైనస్సా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -