మంత్రుల దగ్గరకు వెళ్లొద్దు.. నేనే సీనియర్‌ను..

మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు అధికార వైసీపీలో చర్చకు దారితీశాయి. తనకు మంత్రి పదవి లేదని.. అధికారులు, ప్రజాప్రతినిధులు వేరే మంత్రుల దగ్గరకు వెళ్లాల్సిన పని లేదన్నారు.

మంత్రులు పెద్దిరెడ్డి, బొత్త సత్యనారాయణ తర్వాత తానే సీనియర్‌ని అని చెప్పుకొచ్చారు. ఎలాంటి పనులున్నా తాను చేయగలనని అవసరమైతే.. ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్య పరిష్కరించగలన్నారు. అందుకే ఎవరూ పక్క జిల్లాల మంత్రుల వద్దకు వెళ్లొద్దన్నారు.

విశాఖ జిల్లా భీమిల మండల పరిషత్తు సర్వసభ్య సమావేశంలో అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు.

బీహార్ కంటే దారుణంగా ఏపీ

కేసీఆర్ మౌనానికి కారణమేంటి ?

వారు బయటకొస్తే చంపేస్తా