Sunday, May 5, 2024
- Advertisement -

పాఠశాలలు కాదట.. తరగతులు మాత్రమే విలీనమట !

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జగన్ సర్కార్ 3,4,5 తరగతులను అప్పర్ స్కూల్స్ లో విలీనం చేసిన సంగతి తెలిసేందే. పిల్లల విషయంలో సి‌ఎం జగన్ చేపట్టిన ఈ విధానాన్ని రాష్ట్ర ప్రజలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. ఊర్లోనే ఇళ్లకు దగ్గగరగా ఉండే ప్రైమరీ స్కూల్స్ లో చదువుకునే 3,4,5 తరగతుల చిన్నపిల్లలను ఊరికి దూరంగా ఒక కిలోమీటర్ నుంచి రెండు కిలో మీటర్ల దూరంలో ఉండే అప్పర్ స్కూల్స్ కు పంపించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. చిన్న పిల్లలు స్కూల్స్ కు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు రోడ్లు దాటే క్రమంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, పిల్లలకు ఏదైనా అయితే ఎవరు భాద్యత వహిస్తారని తల్లిదండ్రులు వాపోతున్నారు. తరగతుల విలీనంపై ప్రజల నుంచి ఈ స్థాయిలో వ్యతిరేత వ్యక్తమౌతున్నప్పటికి జగన్ సర్కార్ మాత్రం సమర్థించుకుంటూనే వస్తోంది.

స్కూల్స్ విలీనంపై తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిల్లలు గొప్పవాళ్లు కావాలని కోరుకునే తల్లిదండ్రులు.ఇంటి పక్కనే పాఠశాలలు ఉండాలని కోరుకుంటే ఎలా అని ప్రశ్నించారు. అంతే కాకుండా ప్రభుత్వం చేపట్టే ప్రతి విధానం కూడా ప్రజాభిప్రాయంతోనే జరగాలంటే కుదరని పని అంటూ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం పాఠశాలలను విలీనం చేసిందని చాలా మంది విమర్శలు చేస్తున్నారని, కానీ ప్రభుత్వం పాఠశాలలను విలీనం చేయలేదని.. తరగతులను మాత్రమే విలీనం చేసిందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు.

అయితే మంత్రి చేసిన వ్యాఖ్యలపై విశ్లేషకులు ఘాటుగా స్పందిస్తున్నారు. ప్రైమరీ స్కూల్స్ లో ఉండే 3,4,5, తరగతులను అప్పర్ స్కూల్స్ లో విలీనం చేసిన ప్రభుత్వం.. మిగిలిన 1,2 తరగతులను కూడా అంగన్వాడీ లో విలీనం చేసే అవకాశం ఉన్న ఆశ్చర్యం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. అప్పుడు 1 నుంచి 5 తరగతులు ఉండే ప్రైమరీ స్కూల్స్.. అప్పర్ స్కూల్స్ లో విలీనం అయినట్లే కదా అంటూ కొందరి అభిప్రాయం.

More Like This

వైసీపీకి మరో రెబల్ ఎమ్మెల్యే..?

ప్రజల అటాక్.. వైసీపీ నేతలు జర భద్రం !

జగన్ మద్యపాన నిషేదం హామినే ఇవ్వలేదట ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -