Saturday, April 27, 2024
- Advertisement -

మరో రఘురామలా మారుతోన్న వైసీపీ ఎమ్మ్యెల్యే ?

- Advertisement -

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సాధారణంగా అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు ఎదురుకావడం చూస్తూనే ఉంటాం. కానీ వైఎస్ జగన్ పార్టీ విషయంలో కేవలం ప్రతిపక్షాల నుంచి మాత్రమే కాకుండా సొంత పార్టీ నేతల నుంచి కూడా విమర్శలు ఎదుర్కోవడం బహుశా వైసీపీ కి మాత్రమే చెల్లింది. గత కొన్నాళ్లుగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజు వైసీపీ నేతలపై, సి‌ఎం జగన్ పై ఏ స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారో అందరికీ తెలిసిందే. దీంతో ప్రతిపక్షాలు చేసే విమర్శలు ఎదుర్కోవడం కన్నా.. సొంత పార్టీ నేత రఘురామ చేసే విమర్శలను ఎదుర్కోవడం వైస్ జగన్ కు పెద్ద సవాల్ గా మారింది.

ఇక తాజాగా రఘురామ బాటలోనే మరో వైసీపీ ఎమ్మెల్యే కూడా తన సొంత పార్టీపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజిక వర్గానికి చెందిన జ్యోతుల చంటిబాబు వైసీపీ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యాలు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్టీలో ఎవరు శాశ్వతం కాదని, ఇవాళ ఈ పార్టీలో ఉన్నవారు రేపు ఇంకో పార్టీలో ఉండవచ్చని వ్యాఖ్యానించారు. దీంతో ఆయన వైసీపీ టాటా చెప్పబోతున్నారా ? అనే అనుమానాలు పోలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తమవుతున్నాయి.

అంతే కాకుండా సి‌ఎం జగన్ తీరుపై కూడా జ్య్హోతుల చంటిబాబు అసహనంగానే ఉన్నారట. ఆయన నియోజిక వర్గానికి ప్రభుత్వం నుంచి సరైన సహాయం అందడం లేదని అందుకే జ్యోతుల ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే ఇదిలాగే కొనసాగితే రఘురామ కృష్ణ రాజు మాదిరి వైసీపీకి మరో రెబల్ అభ్యర్థిగా జ్యోతుల చంటిబాబు మారే అవకాశం ఉందనే వాదనలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. మరి జ్యోతుల వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

More Like This

ఆ సర్వే ఫలితాలు జగన్ కు హెచ్చరికే ?

కాంగ్రెస్ కు పెను సవాల్ గా మారిన మునుగోడు వ్యవహారం !

తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం వస్తుందా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -