Saturday, April 20, 2024
- Advertisement -

మద్యపాన నిషేదం.. వైసీపీ మ్యానిఫెస్టోలో లేదా ?

- Advertisement -

2019 ఎన్నికల ముందు ప్రచార సభలలో వైఎస్ జగన్.. రాష్ట్రంలో తాము అధికరంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేదం చేస్తామని చాలా సార్లు చెప్పడం ఏపీ ప్రజలు విన్నారు. అంతే కాకుండా ఆయన ప్రకటించిన మ్యానిఫెస్టో లో కూడా మద్యపానన్ని దశల వారీగా నిషేధిస్తామని ప్రకటించారు. తీర ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టిన తరువాత మద్యపానన్ని నిషేదించకుండా మద్యం అమ్మకాలపై ధరలు పెంచడం వంటివి చేసింది జగన్ సర్కార్. ఇలా చేయడం వల్ల ప్రజలు మద్యాన్ని కొనేందుకు ముందుకు రాలేరని, అప్పుడు మద్యపానన్ని నిషేధించవచ్చని భావించారు. కానీ రేట్లు పెంచిన మద్యాన్ని కొనడం మాత్రం ప్రజలు అపలేదు. దీంతో చేసేదేమీ లేక మద్యపాన నిషేదం అంశాన్ని జగన్ సర్కార్ హోల్డ్ లో పెట్టింది.

అంతే కాకుండా రాష్ట్ర ఆధాయ రాబడిలో మద్యపానం నుంచి వచ్చే ఆదాయమే ఎక్కువగా ఉండడంతో సంపూర్ణ మద్యపాన నిషేధం హామీని పూర్తిగా అట్టకెక్కించారు సి‌ఎం జగన్. దాంతో మద్యపాన నిషేధం విషయంలో జగన్ సర్కార్ పై ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికి వాటిని ఏమాత్రం పట్టించుకోలేదు. ఇక తాజాగా మద్యపాన నిషేధంపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు మరింత హాట్ టాపిక్ గా మారాయి. ” అసలు ఎన్నికల మ్యానిఫెస్టో లో మద్యపాన నిషేదమన్న హామినే లేదని, కావాలంటే మ్యానిఫెస్టో చూసుకోవాలన్నారు. మద్యం తాగాలంటే షాక్ కొట్టేలా రేట్లు పెంచుతామని మాత్రమే చెప్పమన్నారు “. ప్రస్తుతం అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

జగన్ మాటమార్చే విధానానికి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యాలే నిధర్శనం అంటూ ప్రతిపక్ష పార్టీలు ఘాటుగానే విమర్శలు చేస్తున్నాయి. అంతే కాకుండా మద్యపాన నిషేదంపై అప్పుడు జగన్ చేసిన వ్యాఖ్యలను కూడా పోస్ట్ చేస్తూ నెటిజన్లు మండి పడుతున్నారు. నిజంగా ఇచ్చిన హామీని ఇంత బహిరంగంగా తప్పుదోవ పట్టించడం జగన్ సర్కార్ కు మాత్రమే చెల్లిందంటూ చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు. మరి సంపూర్ణ మద్యపాన నిషేదం అసలు మ్యానిఫెస్టోలోనే లేదని చెప్పిన ఏపీ మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యలపై వైఎస్ జగన్ ఏ రకంగా స్పందిస్తాడో చూడాలి.

More Like This

“కాపు నేస్తం” రేపిన చిచ్చు ..!

ఆ సర్వే ఫలితాలు జగన్ కు హెచ్చరికే ?

మోడీ సర్కార్ పై కాలు దువ్వుతోన్న జగన్ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -