వైసీపీ నేతలపై ప్రజల అటాక్.. మామూలుగా లేదుగా !

- Advertisement -

వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తి చేసుకున్నా నేపథ్యంలో ప్రజాభిప్రాయాలను తెలుసుకునేందుకు సి‌ఎం జగన్ ” గడప గడపకు మన ప్రభుత్వం ” పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఆ నియోజిక వర్గానికి చెందిన ఎమ్మేల్యేలు, ఎంపీలు, మంత్రులు, కీలక నేతలు అందరూ కూడా తిరుగుతూ ప్రజాభిప్రాయాలను సేకరించే విధంగా శ్రీకారం చుట్టారు సి‌ఎం జగన్. ఇతవరకు బాగానే ఉన్నప్పటికి ఎప్పుడో ఎన్నికల ముందు ఓట్లు అడుక్కునేందుకు కనిపించిన నేతలు మళ్ళీ ఇన్నాళ్లకు ఇంటింటి దగ్గర కనిపిస్తుండడంతో ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా ఎవరినైనా నిలబెట్టి నిలదీస్తున్నారు రాష్ట్ర ప్రజలు.

దీన్ని బట్టి ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా మంత్రి అంబటి రాంబాబు పల్నాడు జిల్లాలోని తన సొంత నియోజిక వర్గానికి చెందిన రాజుపాలెం గ్రామలో ” గడప గడపకు ప్రభుత్వం ” కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ నేపథ్యంలో కొందరు మహిళలు సంక్షేమ పథకాలు అందడం లేదని, పింఛన్లు రావడం లేదని నిలదీశారు. అసమర్థమైన పాలన అంటూ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను వెళ్ళగక్కారు. దీంతో సమాధానం చెప్పలేక మంత్రి అంబటి అక్కడినుంచి వెళ్ళిపోయారు. ఇక మరో మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ కు కూడా ఇదే అనుభవం ఎదురైంది. ఈ మూడేళ్లలో నిత్యవసర ధరలు విపరీతంగా పెరిగాయని, టాక్స్ ల రూపంలో ప్రజల వద్ద తీసుకున్న డబ్బును..తిరిగి ప్రజలకు ఎందుకు ఖర్చు చేయడం లేదని ఓ మహిళా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన కె బడ్జెట్ లెక్కలు నేర్పించింది.

- Advertisement -

ఈ విధంగా చాలా మంది వైసీపీ నేతలు ” గడప గడపకు ప్రభుత్వం ” కార్యక్రమంలో ప్రజా వ్యతిరేకతను తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. దీంతో వైసీపీ నేతలు ప్రజల వద్దకు వెళ్లాలంటేనే వెనకడుగు వేసే పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పక తప్పదు. మూడేళ్లలో 32 సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టమని గొప్పలు చెప్పుకుంటున్న జగన్ సర్కార్.. :” గడప గడపకు ప్రభుత్వం ” కార్యక్రమంలో ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై సానుకూలంగా స్పందిస్తారని సి‌ఎం జగన్ ఊహిస్తే.. సీన్ రివర్స్ అయి ప్రజలు ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత చూపడం.. ఆ వ్యతిరేకతను రాష్ట్రమంత చూస్తూ ఉండడం నిజంగా వైఎస్ జగన్ కు మింగుడుపడని విషయం.

Also Read

తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం వస్తుందా ?

మళ్ళీ టీడీపీ జట్టుతో బీజేపీ.. కలుస్తోందా ?

మద్యపాన నిషేదం.. వైసీపీ మ్యానిఫెస్టోలో లేదా ?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -