Saturday, May 4, 2024
- Advertisement -

వినాయక చవితి ఉత్సవాలను జగన్ ప్రభుత్వం అడ్డుకట్ట ?

- Advertisement -

వినాయక చవితి దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది. ఎందుకంటే చవితి వేడుకలను అడ్డగించేందుకు పరోక్షంగా జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఇటీవల బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. దీంతో ఒక్కసారిగా వినాయక చవితి ఉత్సవాలు ఏపీలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. అసలు వినాయక చవితి ఉత్సవాలను జగన్ ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవాలని చూస్తోంది అనే దానిపై స్పష్టమైన సమాచారం లేనప్పటికి, కమలనాథులు మాత్రం ఈ విషయాన్ని సీరియస్ గా ప్రస్తావిస్తున్నారు.

వినాయక మంటపాల ఏర్పాటుకు జగన్ సర్కార్ అడ్డంకులు సృష్టించడంతో పాటు వాటి సంఖ్య కూడా తగ్గించేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఇదంతా కుట్ర పూరిత వ్యవహారం అంటూ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యలకు నిరసనగా ఆగష్టు 29 న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టేందుకు సిద్దమయ్యారు బీజేపీ నేతలు.

అయితే వినాయక చవితి ఉత్సవాలను గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి రాజకీయం చేయడం ఏంటని కొందరు సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. బీజేపీకి ఏపీలో ఏమాత్రం ప్రభావం లేదనే సంగతి అందరికీ తెలిసిందే. అందువల్ల ఏపీ ప్రజలను ఆకర్శించేందుకు ఏ చిన్న అవకాశాన్ని కూడా ఏపీ బిజెపి నేతలు వదలడం లేదు. అందులో భాగంగానే జగన్ సర్కార్ వినాయక చవితి ఉత్సవాలపై విధిస్తున్న ఆంక్షలను బీజేపీ తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ నిరసనలకు పిలుపునిచ్చిందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read

రష్యాకు వ్యతిరేకంగా భారత్.. అసలెందుకు ?

వాట్సప్ లో ముఖ్యమైన సెట్టింగ్స్.. వెంటనే చేసుకోండీ !

పోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. అయితే మీకు బ్యాడ్ న్యూస్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -