Saturday, April 27, 2024
- Advertisement -

వాట్సప్ లో ముఖ్యమైన సెట్టింగ్స్.. వెంటనే చేసుకోండీ !

- Advertisement -

స్మార్ట్ ఫోన్ యూజర్స్ లో ప్రతిఒక్కరు వాడే కామన్ యాప్ వాట్సప్. ఈ యాప్ ద్వారా ఇతరులకు మనం మెసేజులు పంపిస్తూ ఉంటాం. అయితే ఈ యాప్ లో ఉండే కొన్ని ముఖ్యమైన సెట్టింగ్స్ గురించి చాలామంది పట్టించుకోరు. కానీ ఆ సెట్టింగ్స్ ఆన్ చేసుకోవడం వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుందాం !

1.టూ స్టెప్ వెరిఫికేషన్
ఈ సెట్టింగ్ చేసుకోవడం వల్ల మన వాట్సప్ చాట్ ను ఇతరులు చూడకుండా జాగ్రత పడవచ్చు. సాధారణంగా వాట్సప్ చాట్ ఇతరులు చూడకుండా ఉండేందుకు థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగిస్తుంటారు చాలామంది. అలా థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించడం వల్ల రిస్క్ లో పడే అవకాశం ఉంది. కానీ వాట్సప్ లోనే ఇన్ బిల్ట్ గా ఉండే టూ స్టెప్ వెరిఫికేషన్ వల్ల మన చాట్ ఇతరులు చూడకుండా పాస్వర్డ్ వెరిఫికేషన్ అడుగుతుంది. అదెలాగో చూద్దాం.

  • ముందుగా వాట్సప్ ఓపెన్ చేసి.. పైన ఉన్న త్రీ డాట్స్ పైన క్లిక్ చేయాలి.
  • ఆ తరువాత సెట్టింగ్ ఆప్షన్ ఎంచుకోని అక్కడ అకౌంట్స్ పైన క్లిక్ చేయాలి.
  • ఆ తరువాత అక్కడ టూ స్టెప్ వెరిఫికేషన్ ఎనబుల్ చేసుకొని ఆరు అంకెల పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి.
    అంతే ఇతరులు మన మొబైల్ తీసుకొని వాట్సప్ చెక్ చేయాలని చూస్తే.. మనం ఇచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది.. వారికి పాస్వర్డ్ తెలియకపోవడం వల్ల వాట్సప్ ఓపెన్ చేయలేరు.

2.సెక్యూరిటీ
ఈ సెక్యూరిటీ ఆప్షన్ డీఫాల్ట్ గా చాలా మందికి ఆఫ్ లో ఉంటుంది..కాబట్టి వెంటనే దీన్ని ఆన్ చేసుకోండీ. దీన్ని ఆన్ చేసుకోవడం వల్ల వాట్సప్ అనేది స్పామ్ బారిన పదకుండా సెక్యూర్ గా ఉంటుంది. దీనికోసం ..

  • వాట్సప్ ఆన్ చేసి, పైన ఉన్న త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి సెట్టింగ్స్ ఆప్షన్ ఎంచుకోవాలి.
  • ఆ తరువాత అకౌంట్స్ ఆప్షన్ ఎంచుకోవాలి.
  • అక్కడ సెక్యూరిటీ పైన క్లిక్ చేసి ” షో సెక్యూరిటీ నోటిఫికేషన్ ” ఆన్ చేయాలి.

3.సెట్ ఫింగర్ ప్రింట్ లాక్
చాలా మంది వాట్సప్ కు లాక్ వేసుకునేందుకు థర్డ్ పార్టీ యాప్స్ పైన ఆధారపడుతూ ఉంటారు. కానీ వాట్సప్ లోనే ఇన్ బిల్ట్ గా ఫింగర్ ప్రింట్ సెట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది అది ఎలాగో చూద్దాం.

  • ముందుగా వాట్సప్ ఓపెన్ చేసి పైన ఉన్న త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి సెట్టింగ్స్ ఆప్షన్ ఎంచుకోవాలి.
  • అక్కడ అకౌంట్స్ ఆప్షన్ ఎంచుకొని ప్రైవసీ పైన క్లిక్ చేయాలి.
  • అందులో కిందకు స్క్రోల్ చేస్తే ఫింగర్ ప్రింట్ లాక్ కనబడుతుంది.
  • ఇది డీఫాల్ట్ గా ఆఫ్ లో ఉంటుంది. దాన్ని మనం ఆన్ చేసుకోవడం వల్ల ఎలాంటి థర్డ్ పార్టీ యాప్ లేకుండానే.. మన వాట్సప్ ను ఇతరులు చూడకుండా ఫింగర్ ప్రింట్ లాక్ సెట్ అవుతుంది.

Also Read: యూట్యూబ్ లో వెంటనే ఈ సెట్టింగ్స్ చేసుకోండి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -