- Advertisement -

జగన్ సరికొత్త వ్యూహాం…టీడీపీ ఖేల్ ఖతం!

- Advertisement -

రెండోసారి వైసీపీని అధికారంలోకి తేవడమే ఆ పార్టీ అధినేత, సీఎం జగన్‌ ముందున్న లక్ష్యం. అందుకే ప్రజాకర్షక కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా రేపటి (26)నుండి బస్సుయాత్రను ప్రారంభించనున్నారు. ప్రతీరోజు మూడు నియోజకవర్గాల్లో సభలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి వైసీపీ నేతలకు ట్రైనింగ్ కూడా ఇచ్చారు.

వైసీపీ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడమే లక్ష్యంగా బస్సుయాత్ర సాగనుంది. జగన్ అంచనాల ప్రకారం వివిధ సామాజిక వర్గాలకు దాదాపు 2.5 కోట్ల మందికి వెల్ఫేర్ స్కీమ్స్‌ అందుతున్నాయి.దీనికి తోడు మరో కోటి మందికి సంక్షేమ పథకాలను అందించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు జగన్.

ఇందుకు సంబంధించి వైసీపీ కీలక నేతలతో సమావేశం నిర్వహించారు జగన్. ఇందులో నేతల సలహాలు,సూచనలు తీసుకుని సంక్షేమ పథకాలు మరింతగా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలో చర్చించారు. అలాగే కొత్తగా తీసుకురాబోయే పథకాలకు సంబంధించి ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

ఇందులో భాగంగా వైసీపీ వాలంటీర్లతో ఇంటింటి సర్వే నిర్వహించి సంక్షేమ పథకాలు అందని వారి జాబితాను సిద్ధం చేయనున్నారు. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే కులాల వారీగా లెక్కలు తీయడం ప్రధానంగా కమ్మ,కాపు,రెడ్డి సామాజికవర్గాల్లో అర్హత ఉండని సంక్షేమ పథకాలు అందని వారిని గుర్తించనున్నారు. వీరికి పథకాలు ఎలా వర్తింప చేయాలో గైడ్ లైన్స్ సిద్ధం చేయనున్నారు. దీంతో పాటు పెట్రోల్, డీజీల్ ధరలపై సర్‌ఛార్జ్‌ తగ్గించే యోచనలో ఉన్నారు జగన్. మొత్తంగా ఏపీలోని అన్నివర్గాల వారికి న్యాయం చేకూరేలా జగన్‌ పక్కా ప్రణాళికతో విపక్ష టీడీపీ – జనసేన కూటమికి ఎలాంటి ఛాన్స్ ఇవ్వకూడాదని భావిస్తున్నారు. ఒకవేళ ఇదే గనుక జరిగితే టీడీపీ పని ఖతమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -