- Advertisement -

ఉన్నది 6…రేసులో 15!

- Advertisement -

తెలంగాణ కేబినెట్ విస్తరణ ఇప్పుడు సీఎం రేవంత్ ముందున్న సిసలైన సవాల్. ఎందుకంటే తొలి దశలో తనతో పాటు 12 మందికి కేబినెట్ విస్తరణలో చోటు కల్పించారు. ఇక్కడి వరకు ఎవరికి ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడే సీఎం రేవంత్‌కు అసలైన సమస్య. ఎందుకంటే తెలంగాణ కేబినెట్‌లో 18 మందికే చోటు కల్పించే అవకాశం ఉండగా 12 మందికి చోటు కల్పించారు రేవంత్.

ఇక మిగిలిన 6 కేబినెట్ బెర్త్‌ల కోసం టీ కాంగ్రెస్‌లో పోటీ పెరిగిపోయింది. జిల్లాల వారీగా దాదాపు 15 మంది పోటీ పడుతున్నారు.ఇందులో ఓడిపోయిన నేతలు సైతం ఉన్నారు. ప్రధానంగా షబ్బీర్ అలీ, మల్‌రెడ్డి రంగారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, సుదర్శన్ రెడ్డి, మధుయాష్కి, అద్దంకి దయాకర్ పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే త్వరలో జరిగే విస్తరణలో ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రాధాన్యం ఉండనుందని తెలుస్తోంది.

ఆదిలాబాద్ నుండి వివేక్, వినోద్ మద్య గట్టి పోటీ నెలకొంది. అలాగే మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ,ఫిరోజ్ ఖాన్ మధ్య పోటీ నెలకొంది. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావ్ కేబినెట్ రేసులో ఉన్నారు. గ్రేటర్ నుంచి మైనంపల్లి హన్మంతరావు, అంజన్ కుమార్ యాదవ్, మధుయాష్కి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఇలా మొత్తంగా ఎవరికి వారే తమ ప్రయత్నాల్లో మునిగిపోయారు. మరి ఎవరిని అదృష్టం వరిస్తుందో వేచిచూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -