మాటల మాంత్రికుడు మళ్లీ మాయ చేశాడు.అయితే ఈసారి చేసింది రీల్ లైఫ్లో కాదు…. రియల్ లైఫ్లో.
మొన్నటి వరకూ చైతుతో అనుకుంటోన్న వెంచర్ ను… ఇపుడు నితిన్ తో చేస్తున్నాడు.దీంతో ఒక్కసారిగా సీన్ సితార్ అయింది.
త్రివిక్రమ్ వెంచర్ నుంచి చైతు అవుట్ …నితిన్ ఇన్ అనేసరికి…. లేనిపోని సమస్యలు వచ్చిపడ్డాయి.కాని ఇదంతా నితిన్ ,అతని తండ్రి చేసిన మార్కెటింగ్ స్ట్రాటజీతోనే ఇలా జరిగిందని పరిశ్రమలో చెబుతున్నారు.
ఎందుకంటే రెమ్యునిరేషన్ దగ్గర నుంచి వర్క్ ఫ్రీడమ్ వరకూ అన్ని విభాగాల్లోను మాటల మాంత్రికుడు ఎలా కావాలంటే అలా చేసుకోమని…. నితిన్ హామి ఇచ్చేశాడు.కాని ఈ విషయంలో నాగ్ ఫెయిల్ అయ్యాడు. ఎందుకంటే రేపు కమిట్ అయితే…. షూటింగ్లోని ప్రతి విషయంలోను చైతు కోసం వేలి పెట్టి… రచ్చ రచ్చ చేస్తాడనేది అందరికీ తెలిసిన విషయం.
అందుకే రేపన్న రోజు పడ్డ కష్టానికి తగ్గ ఫలితాన్ని అక్కినేని టీం ఎక్కడ ఎత్తుకుపోతుందోనని మాటల మాంత్రికుడు అక్కడ తెలివిగా తప్పించుకున్నాడు.ఇక్కడ రెడ్డిగారికి కమిట్ అయిపోయాడు.మరి నితిన్ దర్శకులకు ఇచ్చే ఫ్రీడమ్ ఎలా ఉంటుందో పరిశ్రమకు తెలియంది కాదు.అయితే అంతా అంటున్నట్లు…. పవన్ చెబితేనే త్రివిక్రమ్ ఇలా నితిన్ తో చేస్తున్నాడనే దాంట్లో ఏమాత్రం వాస్తవం లేదు.
