- Advertisement -

దృశ్యం 3..మోహన్ లాల్‌ షాకింగ్ రెమ్యునరేషన్!

- Advertisement -

భారతీయ చలనచిత్ర రంగంలోనే మోస్ట్ సక్సెస్‌ఫుల్ థ్రిల్లర్ ఫ్రాంచైజీగా నిలిచిన ‘దృశ్యం 3’ పై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం మేకర్స్ బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదు. ఈ నేపథ్యంలో, ఈ సినిమాలో నటిస్తున్న స్టార్ కాస్ట్‌కు ఇస్తున్న పారితోషికాల వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

‘దృశ్యం’ సిరీస్‌కు ప్రాణమైన ‘జార్జ్‌కుట్టి’ పాత్రను పోషిస్తున్న మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఈ చిత్రానికి గాను అత్యధిక పారితోషికం అందుకుంటున్నారు.
మూడో పార్టు కోసం మోహన్‌లాల్ ఏకంగా రూ. 15 కోట్ల నుంచి రూ. 18 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

ఈ ఫ్రాంచైజీకి ఉన్న గ్లోబల్ క్రేజ్ మరియు జార్జ్‌కుట్టి పాత్రకు ఆయన తెచ్చే స్టార్‌డమ్ దృష్ట్యా ఈ స్థాయి పారితోషికం ఇవ్వడం సహజమేనని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. జార్జ్‌కుట్టి భార్యగా, ఈ సిరీస్‌లో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న సీనియర్ నటి మీనాకు రూ. 1 కోటి నుంచి రూ. 1.5 కోట్ల వరకు పారితోషికం అందుతున్నట్లు టాక్.

మురళీ గోపి (ఐజీ గీతా ప్రభాకర్ భర్త రూ. 50 లక్షల నుంచి రూ. 70 లక్షలు, జార్జ్‌కుట్టి కుమార్తెలుగా నటిస్తున్న అన్సిబాకు రూ. 20 లక్షల నుంచి రూ. 30 లక్షల మధ్య పారితోషికం లభిస్తున్నట్లు తెలుస్తోంది. చిన్న కుమార్తెగా నటించిన ఎస్తేర్ అనిల్‌కు ఈ చిత్రంలో అందరికంటే తక్కువగా దాదాపు రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు పారితోషికం అందుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. మొత్తంగా నటీనటుల పారితోషికాల పరంగా కూడా మలయాళ చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -