- Advertisement -

మళ్లీ ఎమ్మెల్సీగా కోదండరాం!

- Advertisement -

ప్రొ.కోదండరాంను మళ్లీ ఎమ్మెల్సీకి నామినేట్ చేస్తాం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజల సమస్యలను ప్రస్తావించేవాళ్లు చట్టసభల్లో ఉండాలనేది నా ఆలోచన కానీ దానికి కూడా అడ్డుపడుతున్నారన్నారు. మీ ఇంటిల్లిపాదీ మంత్రులుగా ఉంటే తప్పు లేదు కానీ.. కోదండరాం ఎమ్మెల్సీగా ఉంటే తప్పా? చెప్పాలన్నారు.

తెలంగాణలో సింహాలు, ఏనుగులు లేనే లేవు…మానవ రూపంలో ఉన్న మృగాలు ఫామ్‌హౌస్‌లలో ఉన్నాయి అని ఎద్దేవా చేశారు. AIని ఉపయోగించి లేని ఏనుగులు, సింహాలను సృష్టించి అభివృద్ధిని అడ్డుకున్నారు అన్నారు. మళ్లీ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తా…యూనివర్సిటీ అభివృద్ధికి ఏం కావాలో అడగండి.. అంచనాలు తయారుచేసి ఇవ్వండి అని కోరారు.

పోలీసులను ఆదేశిస్తున్నా.. ఆ ఒక్క రోజు యూనివర్సిటీలో ఒక్క పోలీస్ కనిపించొద్దు.. నిరసన తెలిపేవారిని తెలపనివ్వండి … ఆర్ట్స్ కాలేజీ వద్ద మీటింగ్ పెట్టి నిధులు మంజూరు చేస్తా అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీని ప్రపంచంతో పోటీ పడగలిగే స్థాయిలో తీర్చిదిద్దుతాం… యూనివర్సిటీ అభివృద్ధి అధ్యయనానికి ఇంజనీర్స్ కమిటీ వేయాలని అధికారులను ఆదేశిస్తున్నా అన్నారు. ఈ ఏడాది విద్యాశాఖ కోసం రూ.40 వేల కోట్లు ఖర్చు పెట్టాం అన్నారు.

ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ అనే పదానికి ప్రత్యామ్నాయం… ఈ రెండూ అవిభక్త కవలల్లాంటివి, ఉస్మానియా గడ్డ మీది నుంచే పీవీ నరసింహారావు దేశ స్వాతంత్య్రం కోసం ధిక్కార స్వరాన్ని వినిపించారు అన్నారు. క్యాన్సర్ లెక్క కొద్దికొద్దిగా ఉస్మానియా యూనివర్శిటీని నిర్వీర్యం చేసే కుట్ర చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైస్ ఛాన్సిలర్లను నియమించామని రేవంత్ రెడ్డి అన్నారు.

ఉద్యమంలో కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం సమాజాన్ని పట్టించుకోలేదు. మలిదశ ఉద్యమంలో శ్రీకాంతాచారి తెలంగాణ కోసం అమరుడయ్యాడు. శ్రీకాంత చారి అమరుడైనందుకు ఆయన కుటుంబానికి ఎలాంటి ప్రయోజనం లేదు. యాదయ్య తెలంగాణకోసం అమరుడయ్యాడు. ఇలా ఎంతోమంది తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయారు. కానీ, వారి కుటుంబాలకు ఎలాంటి న్యాయం జరగలేదని రేవంత్ రెడ్డి అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -