రణరంగాన్ని తలపించింది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ. బీజేపీపై మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు చేయగా ప్రతిపక్ష బీజేపీ ఆందోళనలతో అట్టుడికిపోయింది బెంగాల్ అసెంబ్లీ. బీజేపీని బెంగాల్ వ్యతిరేక పార్టీగా అభివర్ణించింది మమత.
ఓటు చోరీతో బీజేపీ అతి పెద్ద దోపిడీకి పాల్పడిందని ఆరోపణలు చేశారు. దీంతో ఆగ్రహించిన బీజేపీ ఎమ్మెల్యేలు మమత ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యేల కేకలు, నినాదాలు, ఈడ్చివేతలతో రణరంగంగా మారింది బెంగాల్ అసెంబ్లీ.
మార్షల్స్ సాయంతో బీజేపీ ఎమ్మెల్యేలను బయటకు పంపించేశారు స్పీకర్.మమతా మాట్లాడుతూ…బీజేపీ అవినీతి పార్టీ, ఓటు దొంగల పార్టీ, బెంగాలీలకు వ్యతిరేక పార్టీ”గా అభివర్ణించడంతో హౌస్లో గందరగోళం నెలకొంది. పార్లమెంట్లోనే మన ఎంపీలను సీఐఎస్ఎఫ్తో వేధించారు. వీరు బెంగాలీలకు వ్యతిరేకులు అని మమతా ఆరోపించారు. బెంగాలీ వలసదారుల హక్కులు, భద్రతపై చర్చను ఉద్దేశపూర్వకంగా భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు అని విమర్శించారు మమతా.
అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య పరస్పర నినాదాలతో సభను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది.
