ఈరోజు ఆకాశంలో అరుదైన ఖగోళ సంఘటన జరగనుంది. ఆదివారం, సెప్టెంబర్ 7, 2025 రాత్రి భారత ఆకాశాన్ని అలరించనుంది. ఈ సంవత్సరం చివరి సంపూర్ణ చంద్ర గ్రహణం కావడంతో ఖగోళ ప్రియులు తప్పనిసరిగా వీక్షించదగిన సంఘటనగా భావిస్తున్నారు. ఈ చంద్రగ్రహణం భారత్, ఆసియా, ఆఫ్రికా, యూరప్, ఆస్ట్రేలియా మరియు అమెరికాస్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించనుంది.
దేశంలో ఉపచ్ఛాయ గ్రహణం ప్రారంభం: రాత్రి 8:59 కాగా ఆంశిక గ్రహణం ప్రారంభం: రాత్రి 9:58, సంపూర్ణ చంద్ర గ్రహణం ప్రారంభం: రాత్రి 11:01, గరిష్ట గ్రహణం: రాత్రి 11:42, సంపూర్ణ గ్రహణం ముగింపు: రాత్రి 12:22 (సెప్టెంబర్ 8) కానుంది.
మొత్తం 5 గంటలు 24 నిమిషాలు గ్రహణం ఉండనుండగా భారత్‌తో పాటు ఈ ప్రదేశాల్లో కూడా చంద్ర గ్రహణం పూర్తిగా లేదా కొంతవరకు కనిపిస్తుంది. తూర్పు ఆఫ్రికా,ఆస్ట్రేలియా (సిడ్నీ, మెల్బోర్న్), సింగపూర్, దుబాయ్, లండన్,టోక్యో,కేప్ టౌన్,యూరప్‌లోని చాలా ప్రాంతాల్లో కనిపించనుంది. వాతావరణం కారణంగా నేరుగా చూడలేని వారికి లైవ్ స్ట్రీమింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది.
