- Advertisement -

టీకాంగ్రెస్‌లో జూబ్లీహిల్స్ తుపాను!

- Advertisement -

తెలంగాణలో త్వరలో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బీఆర్ఎస్ దివంగత మాగంటి గోపినాథ్ సతీమణి సునీతను అభ్యర్థిగా ప్రకటించగా కాంగ్రెస్ మాత్రం అభ్యర్థి ఎంపికలో తర్జనభర్జన పడుతోంది. ప్రధానంగా అంజన్‌ కుమార్ యాదవ్, నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్ మధ్య పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది.

ఇక హైదరాబాద్ ఇంఛార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ జూబ్లీహిల్స్ ఎన్నికలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంజన్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో స్థానికులకు అవకాశం ఉంటుందని, బయటి నుంచి దిగుమతి ఉండదని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

ఈ వ్యాఖ్యలపై అంజన్ కుమార్ యాదవ్ స్పందించారు. పార్టీలో పొన్నం ప్రభాకర్ కంటే తాను సీనియర్ నాయకుడినని …జూబ్లీహిల్స్ టిక్కెట్ ఎవరికి అనేది అధిష్ఠానం నిర్ణయిస్తుందని, పొన్నం ప్రభాకర్ కాదని విమర్శించారు.కాంగ్రెస్ పార్టీలో ఒకే కుటుంబం నుంచి ఒకరికి మించి ప్రజాప్రతినిధులుగా ఉన్నారని కూడా ఆయన గుర్తు చేశారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతి, కోమటిరెడ్డి సోదరులు, మల్లు భట్టివిక్రమార్క, ఆయన అన్న మల్లు రవి, వివేక్ కుటుంబంలో ఆయన మంత్రిగా ఉంటే కొడుకు ఎంపీగా, సోదరుడు ఎమ్మెల్యేగా ఉన్నారని గుర్తు చేశారు. తన కుమారుడు ఎంపీగా ఉన్నంత మాత్రాన తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు.బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉండాలని మహమూద్ అలీకి ఎమ్మెల్సీ ఇచ్చి ఉప ముఖ్యమంత్రిని, హోంమంత్రిని చేశారని గుర్తు చేశారు. నాయిని నర్సింహారెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి హోంమంత్రిని చేశారని అంజన్ కుమార్ యాదవ్ గుర్తు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -