- Advertisement -

శ్రేయాస్ ఆరోగ్య పరిస్థితిపై సూర్య

- Advertisement -

టీమిండియా ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ గాయంపై సూర్యకుమార్ యాదవ్ స్పందించారు. సీరీస్ అయిపోయిన తర్వాత శ్రేయాస్‌ను జట్టుతో పాటే ఇండియాకు తీసుకెళ్తామని చెప్పారు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడవ వన్డేలో అలెక్స్ కేరీ క్యాచ్ పట్టే ప్రయత్నంలో తీవ్రంగా గాయపడ్డారు శ్రేయాస్. ప్రస్తుతం శ్రేయాస్ ICU నుంచి రాగా ఆరోగ్య ఉన్నాడని తెలిపారు సూర్య.

అయ్యర్ ఇప్పుడు ఫోన్‌లో మెసేజ్‌లకు రిప్లై ఇస్తున్నాడు అంటే ఆయన స్థితి బాగానే ఉందన్న మాట… డాక్టర్లు కూడా ఆయనతో ఉన్నారు. ఆయన మాట్లాడుతున్నారు కూడా కాబట్టి పరిస్థితి మెరుగుపడుతోంది. ఇంకో కొన్ని రోజులు ఆయనను పరిశీలనలో ఉంచుతారు అని చెప్పారు.

ఇలాంటి గాయాలు చాలా అరుదుగా జరుగుతాయి. కానీ శ్రేయాస్ లాంటి రేర్ టాలెంట్‌కి రేర్ విషయాలే జరుగుతాయి. దేవుడి దయవల్ల ఇప్పుడు అంతా బాగానే ఉంది. అని అన్నారు. బీసీసీఐ అధికారి మాట్లాడుతూ శ్రేయాస్‌ను ICU నుంచి షిఫ్ట్ చేశారు. మరికొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండి పూర్తిగా కోలుకున్న తర్వాతే డిశ్చార్జ్ అవుతారు అని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -