టీమిండియాతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే గెల్చుకుంది ఆస్ట్రేలియా. ఆడిలైడ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్‌పై రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత్ విధించిన 265 పరుగుల టార్గెట్‌ను 46.2 ఓవర్లలో 8 వికెట్లు కొల్పోయి చేధించింది.
ఆసీస్ బ్యాటర్లలో మాథ్యూ షార్ట్ (74), కూపర్ కొన్నోలీ (61 నాటౌట్; 53 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలు చేశారు. మిగిలిన వారిలో మిచెల్ ఓవెన్ (36), మాట్ రెన్షా (30) లు రాణించారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్‌లు తలా రెండు వికెట్లు తీశారు. అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్‌లు చెరో వికెట్ సాధించారు.
తొలుత భారత్ నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ (73), శ్రేయస్ అయ్యర్ (61) ,అక్షర్ పటేల్ (44 ), హర్షిత్ రాణా (24 నాటౌట్) రాణించారు.
