- Advertisement -
ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పలువురు లబ్ధిదారులకు చీరలను పంపిణీ చేశారు సీఎం . ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం… ఇందిరా గాంధీ భారత దేశానికి బలమైన నాయకత్వాన్ని అందించారు అన్నారు.
అట్టడుగు వర్గాల కోసమే తన చివరి శ్వాస వరకు పని చేశారు … మన దేశ గౌరవాన్ని పెంచిన ఇందిరా సేవల్ని స్మరించుకోవాలి అన్నారు. తన పరిపాలనలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు … ఎన్నో విప్లవాత్మక మార్పులు ఈ దేశంలో ఇందిరా గాంధీ తెచ్చారు అన్నారు.
కోటి మంది మహిళలకు కోటి చీరలు పంపిణీ చేయనుంది ప్రభుత్వం . తొలి దశలో ఇవాళ్టి నుంచి డిసెంబరు 9 వరకు చీరల పంపిణీ జరగనుంది. రెండవ దశలో మార్చి 1నుంచి మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు పట్టణ ప్రాంతాల్లో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ చేయనుంది ప్రభుత్వం.
