- Advertisement -

రాజమౌళి వ్యాఖ్యలపై బండి సంజయ్

- Advertisement -

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయ, మతపరమైన వివాదానికి దారితీశాయి. దీనిపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. మాజీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సానుకూలంగా స్పందిస్తూ..రాజమౌళి నిండు నూరేళ్లు బ్రతికి మంచిగా సక్సెస్ అవ్వాలని అమ్మవారిని కోరుతున్నా. దేవుడు కరుణించి రాజమౌళి దేవుడిని నమ్మే విధంగా మార్చి, ఆయన కరుణా కటాక్షాలు రాజమౌళిపై ఉండాలని కోరుకుంటున్నా అన్నారు.

అయితే, మరో బీజేపీ నేత చీకోటి ప్రవీణ్ రాజమౌళిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమౌళి… హిందువులు నీ సినిమాలు చూడకపోతే నీ బ్రతుకు ఏమవుద్దో తెలుసు కదా?” అని ఆయన ప్రశ్నించారు. రాజమౌళి సినిమాలను నాస్తిక కుక్కలతోనే తీయాలి… నాస్తిక కుక్కలే సినిమా చూడటానికి అనుమతి ఇవ్వాలి అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

దేవుడిని నమ్మకపోతే ప్రతి సినిమాకు ముందు పూజ ఎందుకు చేస్తున్నాడు? అని ప్రశ్నించారు. బిడ్డా రాజమౌళి, హిందూ సమాజానికి వెంటనే క్షమాపణలు చెప్పకపోతే ద్రోహిగా మిగిలిపోతావు అని చీకోటి ప్రవీణ్ హెచ్చరించారు. రాజమౌళి వ్యాఖ్యలు దేవతల పట్ల అగౌరవంగా ఉన్నాయని ఆరోపిస్తూ ఇప్పటికే పలువురు ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో, బీజేపీ నేతల ఈ వ్యాఖ్యలు మరింత ఉద్రిక్తతను పెంచాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -