- Advertisement -

53వ సీజేఐగా సూర్యకాంత్ ప్రమాణస్వీకారం

- Advertisement -

భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్య కాంత్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. న్యాయవ్యవస్థకు నాయకత్వం వహిస్తూ ఆయన 14 నెలల పదవీకాలాన్ని ప్రారంభించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌లో ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.

65 ఏళ్లు పూర్తి చేసుకున్న మాజీ CJI భూషణ్ ఆర్. గావాయి నుండి ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(2) ప్రకారం రాష్ట్రపతి ముర్ము ఆయన్ను CJI గా నియమించారు. హర్యానాలోని హిసార్ జిల్లాలో ఒక మధ్యతరగతి కుటుంబంలో ఫిబ్రవరి 10, 1962న జస్టిస్ కాంత్ జన్మించారు. చిన్న పట్టణ న్యాయవాదిగా మొదలై, దేశంలో అత్యున్నత న్యాయ పదవిని చేరుకున్నారు.

అనేక జాతీయ ప్రాధాన్యత మరియు రాజ్యాంగపరమైన తీర్పులలో భాగమయ్యారు. 2011లో కురుక్షేత్ర యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీలో ‘ఫస్ట్ క్లాస్ ఫస్ట్’ గా నిలిచిన ప్రత్యేక గుర్తింపు ఆయనకు ఉంది. పంజాబ్ మరియు హర్యానా హైకోర్టులో అనేక ముఖ్యమైన తీర్పులు అందించిన జస్టిస్ కాంత్, అక్టోబర్ 5, 2018న హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన పదవీకాలంలో, జస్టిస్ కాంత్ అనేక మైలురాయి తీర్పులలో భాగమయ్యారు. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేయడం,పెగాసస్ స్పైవేర్ కేసు, బ్రిటిష్ కాలం నాటి దేశద్రోహం చట్టాన్ని (Sedition Law) నిలుపుదల చేస్తూ, ప్రభుత్వం సమీక్ష పూర్తి చేసే వరకు కొత్త FIR లను నమోదు చేయవద్దని ఆదేశించారు. రక్షణ దళాలకు సంబంధించిన OROP పథకాన్ని రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అయ్యేదిగా ధృవీకరించారు. చట్టవిరుద్ధంగా తొలగించబడిన ఒక మహిళా సర్పంచ్‌ను తిరిగి నియమిస్తూ, గ్రాస్ రూట్ ప్రజాస్వామ్యం మరియు లింగ వివక్ష గురించి తీర్పు ఇచ్చారు జస్టిస్ కాంత్ ఫిబ్రవరి 9, 2027న 65 ఏళ్లు నిండిన తర్వాత పదవీ విరమణ చేస్తారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -