- Advertisement -

ఏపీకి దిత్వా తుఫాన్‌ ముప్పు

- Advertisement -

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం..తుఫాన్‌గా బలపడింది. దీని ప్రభావంతో తెలంగాణ,ఏపీ,కేరళ,తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరన శాఖ తెలిపింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ఈ నెల 30న ఏపీకి భారీ వర్షసూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.ఈ తుఫాన్‌కు దిత్వాగా నామకరణం చేశారు.

సైక్లోన్ దిత్‌వా దెబ్బకు శ్రీలంకలో 12కిపైగా జిల్లాల్లో ప్రళయకర వరదలు సంభవించాయి. ఇప్పటివరకు 56 మంది మృతి చెందగా 21 మంది గల్లంతు అయినట్లు సమాచారం. 12,000కు పైగా కుటుంబాలు—44,000 మంది ప్రజలు—తీవ్రంగా ప్రభావితమయ్యారు.

సైక్లోన్‌ను ఎదుర్కొనేందుకు మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాం అని తెలిపారు తమిళనాడు సీఎం స్టాలిన్. డెల్టా జిల్లాలు, దక్షిణ ప్రాంతాల్లో నవంబర్ 29–30 తేదీల్లో భారీ వర్షం హెచ్చరికలు ఉన్నాయి. సంబంధిత జిల్లా కలెక్టర్లతో సమావేశం జరిగి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించాం. అవసరమైన చోట ఉపశమన శిబిరాలు ఏర్పాటు చేస్తాం అని తెలిపారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో కూడా ప్రభావం ఉండనుంది. తెలంగాణలో నవంబర్ 30, డిసెంబర్ 1న భారీ వర్షాలు కురియనుండగా దక్షిణ అంతర్గత కర్ణాటక: నవంబర్ 29న ప్రభావం ఉండే అవకాశం ఉంది.

తీర ఆంధ్ర, రాయలసీమ: డిసెంబర్ 2 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. కేరళకు నవంబర్ 30న అతి భారీ వర్షాల హెచ్చరిక జారీ చేశారు. దక్షిణ భారతం మొత్తంగా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని వాతావరణ శాఖ సూచించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -