- Advertisement -

‘జెట్‌లీ’లో రియా సింఘా!

- Advertisement -

‘మత్తు వదలరా’ దర్శకుడు రితేశ్ రాణా ప్రస్తుతం హాస్య నటుడు సత్యా హీరోగా ‘జెట్‌లీ’ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. కామెడీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా కథ మొత్తం విమానం ప్రయాణం నేపథ్యంగా సాగుతుంది.

నిన్న హీరోయిన్ వివరాలను ఇవాళ వెల్లడిస్తామని చెప్పిన మేకర్స్, తాజాగా మిస్ యూనివర్స్ ఇండియా 2024 రియా సింఘాను సినిమా హీరోయిన్‌గా ప్రకటించారు. ఈ చిత్రంలో ఆమె పేరు కూడా రియాగానే ఉంటుందని సమాచారం. ఆమె లుక్‌ను చూపిస్తూ ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

వెన్నెల కిశోర్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. క్లాప్ ఎంటర్టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. కాల భైరవ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -