దర్శకుడు పూరి జగన్నాథ్ – నటుడు విజయ్ సేతుపతి కలయికలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. విజయ్ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ పోస్టర్ సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది. ఈ చిత్రానికి ‘స్లమ్ డాగ్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. పోస్టర్‌తో పాటు ‘33 టెంపుల్ రోడ్’ అనే ట్యాగ్‌లైన్‌ను కూడా విడుదల చేశారు.
ఫస్ట్ లుక్ పోస్టర్‌లో విజయ్ సేతుపతి బిచ్చగాడి వస్త్రధారణలో, కళ్లజోడు పెట్టుకుని, చేతిలో రక్తంతో తడిచిన కత్తి పట్టుకొని గంభీరమైన, శక్తివంతమైన లుక్‌లో కనిపిస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో చెల్లాచెదురుగా పడి ఉన్న డబ్బు కట్టలు కథ నేపథ్యానికి ఆసక్తిని పెంచుతున్నాయి. “మురికివాడ నుంచి వచ్చే తుఫాను” అనే క్యాప్షన్ సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచుతోంది.
ఈ సినిమాను పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ కలిసి నిర్మిస్తున్నారు. సంగీతాన్ని హర్షవర్ధన్ రామేశ్వర్ అందిస్తున్నారు. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, టబు, దునియా విజయ్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇప్పటివరకు ‘బెగ్గర్’ అనే టైటిల్ ఖరారైందన్న ప్రచారం సాగినప్పటికీ, చివరకు మేకర్స్ ‘స్లమ్ డాగ్’ అనే టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. పూరి–విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టిస్తుందన్న అంచనాలు అభిమానుల్లో పెరుగుతున్నాయి.
