- Advertisement -

మంగళగిరి..ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల ఆందోళ‌న‌

- Advertisement -

మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయం వద్ద ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు చేపట్టిన నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పలువురు పారిశ్రామికవేత్తలను అరెస్ట్ చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

రాయితీలు, ప్రోత్సాహకాలు వెంటనే అమలు చేయాలని కోరుతూ ఆందోళనకు దిగిన తమను అరెస్టు చేయడంపై పారిశ్రామికవేత్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు కన్నీటి పర్యంతమయ్యారు. మేం అడుగుతున్నది కొత్తగా ఏమీ కాదు. ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని మాత్రమే కోరుతున్నాం అని వారు వాపోయారు.

బడా బడా కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వం వేల కోట్ల రూపాయల రాయితీలు, మాఫీలు ఇస్తోందని, అదే సమయంలో చిన్న, మధ్య తరహా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను మాత్రం నిర్లక్ష్యం చేస్తోందని వారు ఆరోపించారు. పరిశ్రమలు పెట్టి ఉపాధి కల్పించాలనుకుంటే మాకు సహాయం చేయకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు. మాకెందుకు రాయితీలు ఇవ్వడం లేదు? అని ప్రశ్నించారు.

అరెస్టులతో తమ పోరాటాన్ని ఆపలేరని, న్యాయమైన హక్కుల కోసం చివరి వరకు పోరాడుతామని ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -