- Advertisement -

కాఫీ ఇవ్వలేదని..ఓ అధికారి ఎంత పనిచేశాడో తెలుసా?

- Advertisement -

కడప జిల్లా ప్రొద్దుటూరులో ఓ మున్సిపాలిటీ అధికారి వ్యవహారం తీవ్ర వివాదానికి దారి తీసింది. పట్టణంలోని ప్రధాన కూడలి వద్ద ఉన్న ఓ హోటల్‌కు వెళ్లిన స్థానిక మున్సిపాలిటీ అధికారి ఒక కాఫీని 1/3 ఇవ్వాలని కోరాడు. అయితే హోటల్ యాజమాన్యం అది సాధ్యం కాదని స్పష్టంగా చెప్పింది. దీనితో ఆగ్రహించిన అధికారి తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ జేసీబీని హోటల్ ముందు తీసుకొచ్చి బెదిరింపులకు పాల్పడ్డాడు.

హోటల్ ఎదుట అక్రమంగా ర్యాంప్ ఏర్పాటు చేశారంటూ వాటిని వెంటనే తొలగించాలని అధికారి డిమాండ్ చేసినట్లు సమాచారం. జేసీబీతో కూల్చివేతకు సిద్ధమవ్వడంతో హోటల్ యజమాని తీవ్రంగా నిరసన వ్యక్తం చేశాడు. ముందుగా తనపై నుంచి జేసీబీని పోనిచ్చి, అనంతరం నిబంధనల ప్రకారం ర్యాంప్ తొలగిస్తామని యజమాని స్పష్టం చేశాడు. ఈ ఘటన పట్టణంలో సంచలనంగా మారగా, అధికారుల అహంకార ప్రవర్తనపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -