- Advertisement -

ప్రియుడి కోసం..భర్తను చంపేందుకు 14 తులాల సుపారీ!

- Advertisement -

కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం లింగాపురం గ్రామంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రియుడి కోసం భర్తను కిరాతకంగా చంపడానికి 14 తులాల బంగారం రౌడీషీటర్లకు సుపారీగా ఇచ్చింది భార్య. తప్పించుకొని పోలీసులను ఆశ్రయించి పట్టించాడు ఆ భర్త.

కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం లింగాపురం గ్రామానికి చెందిన ఈశ్వర్ రెడ్డి, శిల్పారెడ్డి భార్యాభర్తలు. ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న నాగ సుధీర్ అనే యువకుడితో పరిచయం పెంచుకొని వివాహేతర సంబంధం పెట్టుకుంది శిల్పారెడ్డి.

ఈ విషయం తెలిసి మందలించిన భర్త ఈశ్వర్ రెడ్డిని అంతమొందించి అడ్డు తొలగించుకోవాలని పథకం వేశారు భార్య శిల్పారెడ్డి, ప్రియుడు నాగ సుధీర్. హత్య కోసం ప్రియుడికి 14 తులాల బంగారం ఇచ్చింది శిల్పారెడ్డి. రూ.10 లక్షల సుపారీ ఇచ్చి రౌడీషీటర్లతో హత్య చేయాలని పథకం రచించారు.

పథకంలో భాగంగా ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో బైక్ పై వెళ్తున్న ఈశ్వర్ రెడ్డిని కారుతో గుద్ది, కత్తులతో నరికి చంపాలని ప్రయత్నించారు రౌడీషీటర్లు. వారి నుండి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించి, భార్య, ఆమె ప్రియుడు, రౌడీషీటర్లపై పిర్యాదు చేశారు ఈశ్వర్ రెడ్డి. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -