- Advertisement -

భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఇంటి దొంగలు!

- Advertisement -

భద్రాచలం సీతారామ చంద్రస్వామి ఆలయంలో సిబ్బంది చేతివాటం బయటపడింది. భక్తులు స్వామివారికి సమర్పించిన విలువైన పట్టు వస్త్రాలు మాయం అవుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఆన్‌లైన్ విధానం ద్వారా కాకుండా, మాన్యువల్ రసీదులతో వస్త్రాలను స్వీకరించి వాటిని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

విక్రయ కౌంటర్లలో కూడా రేట్లను మారుస్తూ సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఓ భక్తుడు సమర్పించిన పట్టు వస్త్రాలు గల్లంతవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. భక్తుడు రసీదు చూపించినప్పటికీ, దేవస్థాన రికార్డుల్లో ఆ వివరాలు లేకపోవడం అనుమానాలకు తావిచ్చింది.

ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రక్షేత్రంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరమని వారు అభిప్రాయపడుతున్నారు. విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఈవో, అక్రమాలకు పాల్పడిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పూర్తి స్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -