- Advertisement -

ఎస్టీగా పుట్టడమే నేను చేసిన నేరమా..?

- Advertisement -

ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ చేసిన సంచలన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కావాలనే తనను ఒక కేసులో ఇరికించారని, ఎస్టీగా పుట్టడమే తాను చేసిన నేరమా అని ప్రశ్నించారు. తనపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు.

ఫిర్యాదుదారుడు తనకు ఫోన్ చేసి మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ పేర్లు చెప్పాలని బెదిరించాడని వెల్లడించారు. అదేవిధంగా రఘురామ కృష్ణంరాజు కాల్ రికార్డులు తన వద్ద ఉన్నాయని, సరైన సమయంలో ఆధారాలు బయటపెడతానని పేర్కొన్నారు.

ఆర్ఆర్ఆర్ కాల్ డేటా బయటకు తీస్తే ఎవరెవరిని బెదిరించారో తెలుస్తుందని సునీల్ నాయక్ వ్యాఖ్యానించారు. ఈ ట్వీట్‌తో వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -