- Advertisement -

అమానుషం..ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య

- Advertisement -

హైదరాబాద్ నార్సింగిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన దారుణం స్థానికంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.

పోలీసుల వివరాల ప్రకారం, నిందితుడు చాక్లెట్ ఇస్తానని మాయమాటలు చెప్పి చిన్నారిని తనతో తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

చిన్నారి నిన్న సాయంత్రం నుంచి కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా నిందితుడు చిన్నారిని తీసుకెళ్తున్న దృశ్యాలు బయటపడ్డాయి.

సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నట్లు సమాచారం. అనంతరం రాత్రి సుమారు ఒంటి గంట సమయంలో చిన్నారి మృతదేహం ఉన్న ప్రదేశాన్ని చూపించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -