- Advertisement -

మరో వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో వివాదం తెరపైకి వచ్చింది. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్‌కు సంబంధించిన రుద్రా ఇన్‌ఫ్రా కాంట్రాక్ట్ సంస్థపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రుద్రా ఇన్‌ఫ్రా సంస్థకు సంబంధించి, రోడ్లు & భవనాల శాఖ (R&B) అధికారులు కీలక విషయాన్ని వెల్లడించారు.

ఈ సంస్థకు అధికారిక అనుమతులు ఇవ్వలేదని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ కేసులో మరింత సంచలన అంశం బయటపడింది. ఆర్ & బీ ఎస్ఈ సంతకాలు నకిలీగా ఉపయోగించారన్న ఆరోపణలు రాగా ఫోర్జరీ చేసిన పత్రాలతో కాంట్రాక్ట్ పనులు నిర్వహిస్తున్నట్టుగా సమాచారం.

ఈ ఆరోపణలు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీశాయి. రుద్రా ఇన్‌ఫ్రా పేరుతో అనంతపూర్‌లో సుమారు రూ.3 కోట్ల విలువైన పనులు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
అధికారిక అనుమతులు లేకుండానే ఈ పనులు జరుగుతున్నాయన్నది ప్రధాన వివాదాంశం.

దగ్గుపాటి ప్రసాద్ స్పందిస్తూ ఈ సంస్థ తన బంధువుల పేరిట రిజిస్టర్ అయిందని చెబుతున్నట్టు సమాచారం. అయితే ఈ వివరణపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారం శ్రీనివాస్ చౌదరి చేసిన ఆర్టీఐ దరఖాస్తు ద్వారా బయటపడింది. దీంతో ఈ అంశం మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది.

ఈ వివాదం టీడీపీకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.ప్రతిపక్షాలు ఈ అంశాన్ని బలంగా లేవనెత్తే అవకాశం కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -