- Advertisement -

ఎమ్మెల్యే కొలిక‌పూడి మ‌రో వాట్సాప్ స్టేట‌స్‌

- Advertisement -

టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి మరోసారి తన వాట్సాప్ స్టేటస్‌తో చర్చనీయాంశమయ్యారు. రాష్ట్ర బడ్జెట్‌పై బహిరంగ చర్చకు రావాలని అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులకు ఆయన వాట్సాప్ స్టేటస్ ద్వారా ఆహ్వానం పలికారు. బడ్జెట్‌లోని అంశాలపై ప్రజల ముందే పారదర్శకంగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.

ఈ నెల 21వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు తిరువూరు జిల్లా పరిషత్ స్కూల్ ప్రాంగణంలో బహిరంగ చర్చ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. బడ్జెట్‌లో ప్రభుత్వ ప్రాధాన్యతలు, కేటాయింపులు, అభివృద్ధి ప్రణాళికలపై నిర్మాణాత్మక చర్చ జరగాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలకు నిజమైన సమాచారం అందించడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని అన్నారు.

రాజకీయ విమర్శలు, ఆరోపణలు సోషల్ మీడియాలో కాకుండా ప్రజల సమక్షంలో వాస్తవాల ఆధారంగా చర్చించాలన్నది తన ఉద్దేశమని కొలికపూడి స్పష్టం చేశారు. అన్ని పార్టీలూ, ప్రజా సంఘాల నాయకులు హాజరై తమ అభిప్రాయాలు వెల్లడించాలని కోరారు.

ఎమ్మెల్యే చేసిన ఈ ఆహ్వానం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. బడ్జెట్‌పై బహిరంగ చర్చకు ఇతర పార్టీలు స్పందిస్తాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -