- Advertisement -

ఇంటర్ విద్యార్థిని గొంతు కోసిన ప్రేమోన్మాది

- Advertisement -

వైఎస్ఆర్ జిల్లాలో ఘోర ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో ఓ యువకుడు ఇంటర్ చదువుతున్న బాలికను కిరాతకంగా హత్య చేయడం ప్రాంతంలో కలకలం రేపింది. ఖాజీపేట అగ్రహారంలో ఈ ఘటన జరిగింది. ఇంటర్ చదువుతున్న కీర్తన (16) అనే విద్యార్థిని ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో, ఆవుల వెంకటేష్ (19) అనే యువకుడు ఆమె ఇంటికి వెళ్లాడు.

ఆమెను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేసిన వెంకటేష్‌కు, కీర్తన స్పష్టంగా నిరాకరించింది.దీంతో ఆగ్రహానికి గురైన వెంకటేష్, కీర్తన గొంతు కోసి కిరాతకంగా హత్య చేశాడు.ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

కీర్తన హత్యకు నిరసనగా ఖాజీపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బంధువులు, గ్రామస్తులు రోడ్డుపైకి వచ్చి రాస్తారోకో నిర్వహించారు.నిందితుడికి కఠిన శిక్ష విధించాలని, ఉరిశిక్ష అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ స్పందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

నిందితుడిని తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -