- Advertisement -

ఏకంగా మంత్రినే నిలదీసిన సామాన్య మహిళ!

- Advertisement -

రాజకీయ పార్టీల ప్రదర్శనలు, ర్యాలీలు సామాన్యుల పాలిట ఎలా శాపంగా మారుతున్నాయో చెప్పడానికి ముంబైలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. బీజేపీ నిర్వహించిన ‘మహిళా సంకల్ప ర్యాలీ’ వల్ల నగరం అంతటా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ క్రమంలో గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఒక మహిళ, అక్కడే ఉన్న మహారాష్ట్ర మంత్రి గిరీశ్ మహాజన్‌పై తన ఆగ్రహాన్ని వెళ్ళగక్కారు.

తన బిడ్డను స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తున్న ఆ మహిళ, ర్యాలీ కారణంగా రోడ్డుపై వాహనాలు కదలలేని స్థితిలో చిక్కుకుపోయారు. గంటలు గడుస్తున్నా ట్రాఫిక్ క్లియర్ కాకపోవడంతో ఆమె తీవ్ర అసహనానికి లోనయ్యారు. సరిగ్గా అదే సమయంలో ర్యాలీలో పాల్గొంటున్న మంత్రి గిరీశ్ మహాజన్ ఆమెకు కనిపించడంతో, నేరుగా ఆయన వద్దకు వెళ్లి నిలదీశారు.

“మీకు ఏదైనా నిరసన తెలపాలంటే లేదా ప్రదర్శన చేయాలంటే మైదానాల్లో చేసుకోండి. ఇలా రోడ్ల మీద ర్యాలీలు తీసి సామాన్య జనాన్ని ఎందుకు ఇబ్బంది పెడతారు?” అని ఆమె గట్టిగా ప్రశ్నించారు. తన బిడ్డను తీసుకురావడానికి వెళ్తున్నానని, గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకోవడం వల్ల పడుతున్న ఇబ్బందులను ఆమె మంత్రికి వివరించారు.

మంత్రిని ఒక సామాన్య మహిళ అంత ధైర్యంగా నిలదీస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. “రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల సమయాన్ని, సౌకర్యాన్ని పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసం?” అంటూ నెటిజన్లు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -