హైదరాబాద్ బాచుపల్లిలో కలకలం రేపిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం ఆత్మహత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్త మరణించిన విషాదం నుంచి కోలుకోకముందే, కనీసం నెల రోజులు కూడా గడవకముందే భార్య రేణుక తన ప్రియుడిని వివాహం చేసుకోవడం స్థానికంగా సంచలనంగా మారింది.
సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న సీతారాం ఫిబ్రవరి నెలలో ఆత్మహత్య చేసుకున్నారు. ప్రారంభంలో ఇది కేవలం మానసిక ఒత్తిడి లేదా వ్యక్తిగత కారణాల వల్ల జరిగిన ఆత్మహత్యగా భావించినప్పటికీ, పోలీసుల విచారణలో విస్తుపోయే కోణాలు బయటపడ్డాయి.సీతారాం భార్య రేణుకకు రమణా రెడ్డి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
భార్య ప్రవర్తన, ఆమె ప్రియుడి వేధింపుల కారణంగానే సీతారాం తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.ఈ కేసులో అత్యంత షాకింగ్ అంశం ఏమిటంటే, ఫిబ్రవరిలో భర్త సీతారాం చనిపోగా.. మార్చి నెలలోనే రేణుక తన ప్రియుడు రమణా రెడ్డిని వివాహం చేసుకుంది. భర్త చనిపోయిన దుఃఖం ఏమాత్రం లేకుండా, ఇంత త్వరగా రెండో పెళ్లి చేసుకోవడంపై సీతారాం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సీతారాం ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలపై బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.నిందితురాలు రేణుకతో పాటు ఆమె ప్రియుడు (ప్రస్తుత భర్త) రమణా రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.వీరిద్దరూ కలిసి సీతారాంను మానసికంగా ఎలా వేధించారు? ఆత్మహత్య వెనుక ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.వివాహేతర సంబంధాలు ఏ విధంగా నిండు ప్రాణాలను బలితీసుకుంటాయో ఈ ఘటన మరోసారి నిరూపించింది.
