- Advertisement -

కూటమి సర్కార్‌..రెండేళ్ల వెన్నుపోటు!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ అధికార కూటమిపై తీవ్ర విమర్శలు గుప్పించారు వైసీపీ నేతలు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన హామీలను అమలు చేయడం లేదని..ఇది ప్రజలకు వెన్నుపోటుగా వైసీపీ నేతలు అభివర్ణించారు.

మేనిఫెస్టోలో పేర్కొన్న సూపర్ సిక్స్ హామీలతో పాటు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన అనేక కీలక వాగ్దానాలను అమలు చేయడంలో చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైఎస్సార్‌సీపీ నేతలు విమర్శించారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, దానిని ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అమలు చేయలేదని, మహిళల ప్రయాణ అవసరాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైసీపీ నేతలు ఆరోపించారు.

రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఇస్తామన్న నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి హామీ కేవలం కాగితాలకే పరిమితమైందని, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా నత్తనడకన సాగుతోందని మండిపడ్డారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం అందిస్తామన్న మాటను ప్రభుత్వం నిలబెట్టుకోలేదని, దీనివల్ల రాష్ట్రంలోని రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని పేర్కొన్నారు.

పాఠశాలలకు వెళ్లే పిల్లల తల్లుల ఖాతాల్లో ఏడాదికి 15,000 రూపాయలు జమ చేస్తామన్న పథకానికి నిధుల కోత విధించారని, లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేందుకు ఆంక్షలు విధిస్తున్నారని ఆరోపించారు వైసీపీ నేతలు. అలాగే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలైన అనేక సంక్షేమ పథకాలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ఎండగడుతూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని వైఎస్సార్‌సీపీ నేతలు స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -