- Advertisement -

వైఎస్‌పై పవన్ ఆరోపణలు..కేవీపీ ఛాలెంజ్!

- Advertisement -

వైఎస్సార్ పై పవన్ చేసిన వ్యాఖ్యల పట్ల కేవీపీ రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేసారు. పవన్ చెబుతున్న వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నారు. ఏ ముఖ్యమంత్రి తన రాజకీయ ప్రణాళికలను పోలీసు అధికారులతో షేర్ చేసుకోరని వివరించారు. ఆ అధికారి లై డిటెక్టర్ ముందుకు అదే విషయం చెబితే రూ 10 కోట్లు పవన్ చెప్పిన సంస్థకు ఇస్తానని ఛాలెంజ్ చేసారు. యువరాజ్యం అధినేత గా పవన్ చేసిన వ్యాఖ్యలను ఓ స్థాయి కలిగిన నేతలు పిల్ల చేష్టలుగా భావించారంటూ కేవీపీ తన లేఖలో పేర్కొన్నారు.

పవన్ కు కాంగ్రెస్ నేత.. వైఎస్సార్ మిత్రుడు కేవీపీ రామచంద్రరావు బహిరంగ లేఖ రాసారు. పవన్ ఈ మధ్య కాలంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. వపన్ తన ప్రసంగంలో తాను చికిత్స కోసం ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఒక పోలీసు అధికారి అప్పటి సీఎం వైఎస్ కేసులు పెట్టేలా ప్రణాళికలు చేస్తున్నట్లుగా పవన్ చెప్పిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. ఆ సమయంలో పవన్ కుటుంబంలో మీలో మీరు పెట్టుకున్న కేసులు తప్ప.. ఎలాంటి తప్పుడు రాజకీయ కేసులు బనాయించినట్లు ఆధారాలు లేవని వివరించారు. ఏ ముఖ్యమంత్రి అయినా తన రాజకీయ ప్రణాళికలను పోలీసు ఆఫీసర్లతో చర్చించరని చెప్పుకొచ్చారు. పవన్ కు చెప్పిన ఆ పోలీసు అధికారి లై డిటెక్టర్ ముందు మీరు చెప్పిన విధంగా వైఎస్ చెప్పారని చెబితే.. రూ 10 కోట్లు పవన్ చెప్పిన సంస్థకు విరాళంగా ఇవ్వటానికి సిద్దమని ఛాలెంజ్ చేసారు. మరణించి 17 ఏళ్లు అయినా.. ఇప్పటికీ వైఎస్ ఇమేజ్ చెక్కు చెదరలేదని వివరించారు.

ప్రజారాజ్యం ద్వారా అప్పట్లో మీరు రంగంలోకి దిగితే ప్రత్యర్థులు రాజకీయంగా కనుమరుగైపోతా రనే అన్నంత ప్రజాభి మానం మీకు పొంగిపొర్లిన దాఖలాలు లేవన్నారు. నిజంగా అంతటి రాజకీయ ప్రజాభిమానం అప్పుడూ లేదు.. ఆ తరువాత లేదని 2019 లో పవన్ రెండు చోట్ల ఓడిన సందర్భాలను కేవీపీ తన లేఖలో గుర్తు చేసారు. యువరాజ్యం అధ్యక్షుడుగా పవన్ నాడు కాంగ్రెస్ నేతలపై అభ్యంతర కర వ్యాఖ్యలు చేసినా.. నాడు ఏ కేసులు పెట్టలేదని.. ఒక స్థాయి ఉన్న ప్రతీ నాయకుడు పవన్ వ్యాఖ్యలను పిల్ల చేష్టలుగా తీసిపారేసారని చెప్పుకొచ్చారు. నాటి చెగువేరా మార్గం నుంచి ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షకుడిగా పరిణితి చెంది కూడా ఇలా అర్దం పర్దం లేని ఆరోపణలు చేయటం తగని పని కాదని పేర్కొన్నారు. కొంత మంది ప్యాకేజీ స్టార్ అంటే మీ మనసు ఎంత గాయపడిందో అర్దం చేసుకోగలనని.. జనం మెచ్చిన నాయకుడి పైన అసత్య ఆరోపణలు చేస్తే ఆయన అభిమానులు కూడా బాధ పడతారని గ్రహించాలని సూచించారు. ఇప్పుడు కేవీపీ లేఖ పైన పవన్ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -