ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలతో పాటు ఈ ఏడాది జరగనున్న ఆసియా క్రీడల సం భారత టీ20 జట్లను బీసీసీఐ ప్రకటించింది. అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఈ ఎంపికలో పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. టీ20 జట్టు సరికొత్త సారథిగా స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్‌ను బీసీసీఐ నియమించింది. అదే సమయంలో భారత టీ20 జట్టుకు అంతకుముందు కెప్టెన్‌గా వ్యవహరించిన సూర్యకుమార్ యాదవ్‌కు ఈ జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. ఈ ఏడాది ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన చేసిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని తొలిసారి సీనియర్ జాతీయ జట్టుకు ఎంపిక చేశారు.
ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను విజేతగా నిలపడం…ఆపై పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్స్ చేర్చడంలో శ్రేయస్ అయ్యర్ చూపించిన లీడర్షిప్ నైపుణ్యాలను సెలెక్టర్లు గుర్తించారు. భవిష్యత్తు టీ20 ప్రణాళికలు, 2028 ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకుని అయ్యర్‌కు పగ్గాలు అప్పగించారు. యువ బ్యాటర్ తిలక్ వర్మను వైస్ కెప్టెన్‌గా నియమించారు.
మరోవైపు, గతంలో భారత్‌కు టీ20 ప్రపంచకప్ అందించిన సూర్యకుమార్ యాదవ్‌ను ఈ సిరీస్‌లకు ఎంపిక చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం. కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత సీనియర్ జట్టుకు ఎంపికైన వైభవ్, అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేస్తే అత్యంత పిన్న వయసులో భారత్ తరఫున ఆడిన ఆటగాడిగా చరిత్ర సృష్టించనున్నాడు.
భారత టీ20 జట్టు:
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ, శివం దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్, ప్రిన్స్ యాదవ్,బుమ్రా.



