- Advertisement -

కుప్పకూలిన ఆలయ మండపం.. ఆరుగురు మృతి

- Advertisement -

మహారాష్ట్రలోని పర్బానీ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. యశ్వాడి గ్రామంలో ఉన్న హనుమాన్ ఆలయ మండపం ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆరుగురు భక్తులు అక్కడికక్కడే మరణించారు.

పర్బానీ జిల్లా యశ్వాడిలోని హనుమాన్ ఆలయంలో భక్తులు ప్రార్థనలు చేసుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా ఆలయ మండపం కూలిపోవడంతో భక్తులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. స్థానికుల సమాచారం మేరకు, ఈ ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు భక్తులు మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు.

మండపం శిథిలాల కింద సుమారు 30 మందికి పైగా భక్తులు చిక్కుకుని ఉంటారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం శిథిలాలను తొలగిస్తూ యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -