దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘వారణాసి’. ఈ సినిమాలో మహేశ్‌కు జోడిగా బాలీవుడ్ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ‘మందాకిని’ అనే కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ప్రియాంక చోప్రా పుట్టినరోజు సందర్భంగా, చిత్రబృందం ఆమెకు స్పెషల్ విషెస్ తెలుపుతూ సెట్స్‌లోని కొన్ని ఆసక్తికరమైన ఫొటోలను విడుదల చేసింది.
ప్రియాంక చోప్రాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ రాజమౌళి తనదైన శైలిలో, ‘‘ఆమె నవ్వితే అందం.. నవ్వకపోతే నిప్పు కణిక’’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు, మహేశ్ బాబు కూడా స్పందిస్తూ, ‘‘మా ఒకే ఒక్క మందాకినికి హ్యాపీ బర్త్‌డే’’ అంటూ తనదైన శైలిలో విషెస్ తెలియజేశారు. ప్రియాంక చోప్రా గత 14 నెలలుగా ఈ సినిమా షూటింగ్లో ఎంతో నిబద్ధతతో పాల్గొంటున్నారు. ఇందులో తాను చేసిన అద్భుతమైన స్లో మోషన్ జంప్స్ ఈ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని ఆమె ఇప్పటికే వెల్లడించారు.
‘వారణాసి’ చిత్రంలో మహేశ్ బాబు ‘రుద్ర’, ‘శ్రీరాముడు’ అనే రెండు విభిన్న పాత్రల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ప్రపంచంతో పాటు కాలాల్ని కూడా చుట్టేసే సాహసికుడి కథగా ఈ చిత్రం రూపొందుతోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అటు అభిమానుల్లో, ఇటు సినీ పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. అక్టోబర్ నాటికి షూటింగ్ మొత్తం పూర్తి చేసి, వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నుంచి ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టాలని చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 7న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు చేస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ మూవీ కోసం ప్రపంచవ్యాప్త సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
